Homeఆంధ్రప్రదేశ్‌Minister Extortion : సంబ‌రాల మంత్రి సైకోయిజం.. శ‌వాలపై పేలాలు ఏరుకోవ‌డం అంటే ఇదే!

Minister Extortion : సంబ‌రాల మంత్రి సైకోయిజం.. శ‌వాలపై పేలాలు ఏరుకోవ‌డం అంటే ఇదే!

Minister Extortion : ఆ సంబరాల మంత్రి పేరు తెలియ‌ని వారు ఏపీలో ఉండ‌రు. సంక్రాంతి సంద‌ర్భంగా ఆయ‌న చేసిన సంబరాలు అలాంటివి. రోడ్డు పై డ్యాన్సులేస్తూ  జ‌నానికి మంచి ఎంట‌ర్టైన్మెంట్ ఇచ్చారు. అభివృద్ధి చేయ‌క‌పోయినా క‌నీసం ఎంట‌ర్టైన్మెంట్ అయినా ఇస్తున్నాడ‌ని జ‌నం ఆయన టాలెంట్ ను మెచ్చుకోలేక ఉన్నార‌ట‌. ఇప్పుడు ఆ మంత్రి సంగ‌తెందుకు అనుకుంటున్నారా ?. ఆ  సంబ‌రాల బాబే కాదు.. సైకో  బాబు అని కూడా నిరూపించుకుంటున్నాడు.

ఆయన నియోజకవర్గంలోని డ్రైనేజీ ప‌నుల్లో ఒక‌రు మ‌ర‌ణించారు. బిడ్డ మ‌ర‌ణించ‌డంతో త‌ల్లిదండ్రులు అనాథ‌ల‌య్యారు. పోషించేవారు లేక నిరాశ్ర‌యుల‌య్యారు. దీంతో వారికి ప్ర‌భుత్వం ప‌రిహారంగా ఐదు ల‌క్ష‌లు ప్ర‌క‌టించింది. ఇక రేపో.. ఎల్లుండో చెక్కు పంపిణీ చేయాలి. కానీ బాధితుల‌కు చెక్కు పంపిణీ జ‌ర‌గ‌లేదు. కార‌ణం ఏంట‌ని చూస్తే .. సంబరాల  బాబుకు స‌గం వాటా ఇవ్వ‌క‌పోవ‌డ‌మే చెక్కు పంపిణీ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణమ‌ని తెలుస్తోంది. బాధితుల‌కు వ‌చ్చే ఐదుల‌క్ష‌ల్లో .. రెండున్న‌ర ల‌క్ష‌లు త‌న‌కు ఇవ్వాల‌ని మంత్రి డిమాండ్ చేశార‌ట‌.

బాధితులు మంత్రి డిమాండ్ కు ఒప్పుకోలేదు. స‌గం డ‌బ్బు ఇచ్చేందుకు నిరాక‌రించారు. పైగా జ‌న‌సేన నేత‌ల స‌హాయంతో మీడియా ముందుకొచ్చారు. దీంతో అంబ‌టికి అరికాల్లో మండింది. త‌న‌పైనే మీడియాకెక్కుతారా ? అంటూ త‌న ప్ర‌తాపం చూపారు. చెక్కు పంపిణీ చేయాల్సిన స‌మ‌యానికి చెక్కు పోయిందంటూ నాట‌క‌మాడారు. ఆ త‌ర్వాత చెక్కు వెన‌క్కి పంపామ‌ని అధికారులు సెల‌విచ్చారు. సంబరాల బాబు సైకోయిజం పై  జ‌నం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. మంత్రి మరీ ఇంత శాడిస్టా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

బాధితులు బిడ్డ‌ను పోగొట్టుకుని పుట్టెడు బాధ‌లో ఉన్నారు. అలాంటి వారి పై క‌క్ష సాధించ‌డం ఎంతవ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని బాధితులు వాపోతున్నారు. త‌మ ఉసురుపోసుకుంటాడంటూ బాధితులు శాప‌నార్థాలు పెడుతున్నారు. అయినా కూడా మంత్రి  తీరు మారకపోవడం గ‌ర్హ‌నీయం. శ‌వాల మీద పేలాలు ఏరుకోవ‌డం అంటే ఇదే. ఇంత‌టి సైకోయిజ‌మా ?. ప్ర‌జ‌ల్ని రాబందుల్లా పీక్కు తిన‌డానికా అధికారం ఇచ్చింద‌ని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. జ‌నం ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా ? త‌లెక్క‌డ పెట్టుకుంటారు మంత్రి గారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version