Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Bus Yatra: పవన్ కళ్యాణ్ ప్రచార రథాన్ని వదలరా?

Pawan Kalyan Bus Yatra: పవన్ కళ్యాణ్ ప్రచార రథాన్ని వదలరా?

Pawan Kalyan Bus Yatra: పవన్ కళ్యాణ్ ఏంచేసినా వైసీపీ వర్గాలు సహించలేకపోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నాయి. ప్రజల మధ్యకు వచ్చినా జీర్ణించుకోలేకపోతున్నాయి. తమకు తెలిసిన ఎదురుదాడిని ఎంచుకుంటున్నాయి. పవన్ పై వ్యక్తిగత విమర్శలతో టార్గెట్ చేస్తున్నాయి. ఆ పార్టీ కీలక నేతల నుంచి సోషల్ మీడియా విభాగం వరకూ పవన్ చర్యలను తప్పుపడుతున్నాయి. పవన్ ను ఏపీ సమాజంలో ఒక బలహీనుడుగా చూపించేందుకు ఆరాటపడుతున్నాయి. గత మూడున్నరేళ్లుగా ఇది చూస్తునే ఉన్నాం. అయితే ఈ క్రమంలో కొన్ని నమ్మలేని నిజాలను సైతం వాస్తవంగా చిత్రీకరించాలని చేస్తున్న ప్రయత్నాలు మరీ ఎబ్బెట్టుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రజల ముందు తేలిపోతున్నాయి. ఇప్పుడు ఏకంగా పవన్ యాత్రకు సిద్ధం చేసిన ‘వారాహి’ వాహనం చుట్టూ విమర్శలు ప్రారంభించారు. అది మోటారు వాహన చట్టానికి విరుద్ధంగా రూపొందించారని ప్రచారం మొదలు పెట్టారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా విభాగం మిమ్స్, ట్యాగ్ లైన్లు తగిలించి ట్రోల్ చేస్తోంది. అయితే దీనిని జనసేన వర్గాలు కూడా తిప్పికొడుతున్నాయి.

Pawan Kalyan Bus Yatra
Pawan Kalyan Bus Yatra

వాహనానికి ‘వారాహి’ అని పేరు పెట్టడంలోనే ప్రత్యేక ఆలోచన కనిపిస్తోంది. దుష్టశక్తుల నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో ప్రత్యేక వాహనాన్ని రూపొందించారు. వారాహి అనే పేరు పెట్టడం వెనుక ఒక సదుద్దేశ్యం ఉందని అటు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. వారాహి అంటే దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు. రాక్షసులను సంహరించేందుకు దుర్గా మాత అమ్మవారు బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్టుగా ‘దేవీ మహాత్యం’ వర్ణిస్తోంది. ఒరటి బ్రహ్మలోని శక్తి బ్రహ్మి, రెండు విష్ణు శక్తి ‘వైష్ణవి’, మహేశ్వరుని శక్తి ‘మహేశ్వరి’, స్కందుని శక్తి కౌమారి, వారాహ స్వామి వారాహి, ఇంద్రుని శక్తి ఐంద్రి, అమ్మవారి భ్రూమధ్యం కనుబొమల నుంచి ఆవిర్భవించిన కాళీ…వీటినే సప్త మాతృకలు అంటారు. అయితే ఇందులో వారాహ ప్రదాయినిది ప్రత్యేక స్థానం. వారాహ అమ్మవారు అన్నప్రదాయిని, చేతిలో ఒకవైపు నాగళి, రోకలి అన్నోత్పత్తిని, ఆయుధాలను సంధించే సంకేతాన్ని చూపినట్టుట్టుంది. అందుకే పవన్ తన వాహనాన్ని వారాహి అని పేరు పెట్టారు. దుష్ట పాలనను అంతమొందించడంతో పాటు రాష్ట్రాన్ని అన్నాన్ని అందించే ఆయుధంగా వాహనాన్ని రూపొందించినట్టు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అటు ఆధ్యాత్మికవేత్తలు సైతం ఏకీభవిస్తున్నారు.

కానీ పవన్ ఏది చేసినా అధికార వైసీపీకి మింగుడుపడదు. జగన్ ను అధికారంలో దించడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తుండడమే దానికి ఒక కారణం. వైసీపీ భావిస్తున్నట్టు ఎప్పుడో ఒకటి రెండుసార్లు బయటకు వస్తారు.. రాజకీయ విమర్శలు చేసి వెళ్లిపోతారంటూ ఇప్పటివరకూ పవన్ పై ఆరోపణ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బస్సుయాత్ర రూపంలో పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వచ్చేందుకు పవన్ సిద్ధపడుతుండడంతో అధికార వైసీపీ నాయకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే వారాహి వాహనంపై ప్రచారం మొదలు పెట్టారు. అటు గోబెల్స్ ప్రచారం కూడా చేస్తున్నారు. గతంలో కూడా పవన్ కాన్వాయ్ ను సిద్ధం చేశారు. భారీ వాహన సముదాయాన్ని సమకూర్చుకున్నారు. దానిపై కూడా రకరకాల కామెంట్లు చేశారు. కానీ అది నా సొంత కష్టార్జితమేనని చెప్పుకొచ్చిన పవన్ ప్రభుత్వానికి కట్టిన పన్నుల లెక్కలతో సహా ఆదాయ వ్యయాలను వివరించారు.

Pawan Kalyan Bus Yatra
Pawan Kalyan Bus Yatra

అయినా వైసీపీ శ్రేణుల్లో ఏమంత మార్పురాలేదు. తాజాగా పవన్ తాను బస్సు యాత్రకు సిద్ధమవుతున్నానని.. జనసేన శ్రేణులకు సోషల్ మీడియాలో వారాహి వాహనాన్ని చూపిస్తే వైసీపీ తట్టుకోలేకపోతోంది, వాహనాన్ని ఎన్నెన్నో లోపాలను అంటగాకి ప్రచారం చేస్తోంది. పవన్ ను పలుచనగా చేసే ప్రయత్నాలు ప్రారంభించింది, మిమ్స్., ఫన్నీని జతచేస్తూ ట్రోల్ చేస్తోంది. అయితే దీనిని జన సైనికులు కూడా సీరియస్ గానే రియాక్టవుతున్నారు. బస్సు యాత్ర ప్రారంభం కాకుండానే వైసీపీ శ్రేణుల్లో ఇంతలా వణుకుతుంటే.. పవన్ యాత్ర ప్రారంభమైతే చుక్కలు చూస్తారని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ విమర్శలను విజయ సంకేతంగా భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version