Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి అన్నీ ఉన్నాయి. కానీ అదృష్టమే లేదు. దర్శకులను ఎలా పట్టుకుని ఎలా మెప్పించాలో ఆమెకు తెలుసు, ఏ హీరోతో ఏ విధంగా మెలగాలో కూడా ఆమెకు తెలుసు. ఇక నిర్మాతలకు తాను ఏ విధంగా మేలు చేయగలనో కూడా ఆమెకు బాగా క్లారిటీ ఉంది. కాకపోతే, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. ప్రగ్యా జైస్వాల్ కి అన్నీ ఉన్నా ఎక్కడో శని ఉంది. ఆ శని పోగొట్టుకోవడానికి ఎక్స్ పోజింగ్ లో పరిధులు దాటేసింది.

ఆ అందాల ఆరబోత చూసి ఆమెకు ఐటమ్ సాంగ్స్ ఇచ్చారు గానీ, హీరోయిన్ గా మాత్రం ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడే బాలయ్యను మెచ్చుకోవాలి. అవకాశాలు లేక అలమటిస్తున్న హీరోయిన్లను ఆదరించడంలో బాలయ్య స్టైలే వేరు. పెద్ద సినిమాలకు పెద్ద హీరోయిన్లను పెట్టుకుంటారు. ఎందుకంటే.. హీరోయిన్ వల్ల కూడా మార్కెట్ అవుతుంది.
కానీ, ఒక్క బాలయ్య సినిమాకే ఆ విధానం అమలు కాదు. హీరోయిన్ ఎవరైనా, విలన్ ఎవరైనా.. బాలయ్య హీరో అంటే చాలు.. మాస్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. దాంతో సహజంగా ‘బి సి’ సెంటర్స్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. అలా బాలయ్యకు స్టార్ హీరోయిన్లతో పని లేకుండా పోయింది. కానీ, ఫేడ్ అవుట్ హీరోయిన్లకు బాలయ్య ఓ వరంలా మారాడు.
అలా కెరీర్ చివరి దశలో ఉన్న ప్రగ్యా జైస్వాల్ కి బాలయ్య ఛాన్స్ ఇచ్చాడు. మొత్తమ్మీద ‘అఖండ’ సినిమా ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో భారీ సినిమా అయింది. ఇప్పుడు ఆమె కెరీర్ కి ఊతం ఇచ్చే సినిమా అయ్యేలా ఉంది. అఖండ బ్లాక్ బస్టర్ ఐతే మాత్రం.. ప్రగ్యా జైస్వాల్ కి మరిన్ని పెద్ద సినిమాలు వచ్చే అవకాశం ఉంది.
అందుకేనేమో, అఖండ సినిమా హిట్ కోసం ప్రగ్యా జైస్వాల్ కూడా తెగ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఏ సినిమాకి చేయని విధంగా అఖండ కోసం సోషల్ మీడియాలో తెగ ప్రోమోట్ చేస్తూ తెగ కష్టపడిపోతుంది. ఎలాగూ బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు కాబట్టి.. ఆ బాధ్యతను తాను తలకెత్తుకుని మరీ సోషల్ మీడియాలో అఖండ అంటూ ఓ ఊపు ఊపేస్తోంది.
Also Read: అప్పటి బాలయ్యను గుర్తు చేస్తున్న ‘జై బాలయ్య’ సాంగ్
ప్రగ్యా జైస్వాల్ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో, ట్విట్టర్లో ‘అఖండ’ సినిమాను ప్రమోట్ చేస్తూ.. ఆ సినిమా తాలూకు విషయాలను ప్రేక్షకులతో పంచుకోవడానికి బాగా ఆరాట పడుతుంది. ఇక పనిలో పనిగా బాలయ్య బాబును కూడా తెగ పొగిడేస్తోంది.
Also Read: బాలయ్య సినిమాకు అండగా కుల పిచ్చోళ్లు !
