https://oktelugu.com/

YS Vijayamma: వైఎస్ విజయమ్మ భేటికి ఏపీ మంత్రి? టాలీవుడ్ ప్రముఖులు?

YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ప్రాంతాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ సంస్మరణ సభ ఏర్పాటుపై చర్చ జోరుగా సాగుతోంది. అసలు ఏం జరుగుతుందోనని టెన్షన్ అందరిలో పుట్టుకొస్తోంది. సభ నిర్వహణపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి చనిపోయి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ విజయమ్మ (YS Vijayamma) సమావేశం ఏర్పాటు చేయడం అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఇదంతా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమేనని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 2, 2021 10:22 am
    Follow us on

    YS VijayammaYS Vijayamma: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ప్రాంతాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ సంస్మరణ సభ ఏర్పాటుపై చర్చ జోరుగా సాగుతోంది. అసలు ఏం జరుగుతుందోనని టెన్షన్ అందరిలో పుట్టుకొస్తోంది. సభ నిర్వహణపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి చనిపోయి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ విజయమ్మ (YS Vijayamma) సమావేశం ఏర్పాటు చేయడం అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఇదంతా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమేనని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ మీటింగ్ జరిగితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఉత్కంఠ అందరిలో నెలకొంది. దీంతో సభ పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

    సెప్టెంబర్ 2 వైఎస్ వర్థంతి సందర్భంగా సంస్మరణ సభ పేరిట అందరికి ఆహ్వానాలు వెళ్లాయి. రెండు ప్రాంతాల నుంచి చాలా మంది వీఐపీలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో సినిమా వాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో రాజకీయాల్లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయోనని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రేపు సమావేశం జరిగితే కానీ అందులో ఏం నిర్ణయిస్తారో తెలియడం లేదు.

    మరో వైపు హుజురాబాద్ ఉప ఎన్నిక ఉండడంతో ఎవరు కూడా సమయం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఓ వైపు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ బిజీగా ఉన్నారు. దీంతో సమావేశానికి ఎవరు వస్తారో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ విజయమ్మ వ్యూహమేంటో ఎవరికి అర్థం కావడం లేదు. అసలు సమావేశం ఎజెండా ఏమిటన్నది అంతుచిక్కడం లేదు.

    సమావేశానికి స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఉమ్మడి శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, సినీ హీరో నాగార్జున, దర్శకులు పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్ తదితరులకు ఆహ్వానాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో అందరు వస్తారో లేదో తెలియడం లేదు. కొందరు ఇప్పుడు కుదరదని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమావేశం నిర్వహణ ఆంతర్యంపై అందరిలో కూడా సందేహాలు వస్తున్నాయి.

    ఇదంతా ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీకే బృందంలోని శిష్యురాలు షర్మిల పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న జరిగే ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అందుకే ఆత్మీయ సమ్మేళనంపై అందరి దృష్టి పడుతోంది. రాజకీయ కోణంలో అందరిలో చర్చలు మొదలయ్యాయి. షర్మిల పార్టీ ఏ మేరకు ప్రభావం చూపనుందో అని ఎదురు చూస్తున్నారు.