https://oktelugu.com/

5వ తరగతి మానేసి.. ఏళ్లుగా డాక్టర్ గా మోసం.. బయటపడిందిలా?

అతడి పేరు వీరగంధం తేజ. స్వస్థలం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బొడ్డువారిపాలెం.  చదివింది 5వ తరగతి.. అక్కడిదాకే చదివి 2005లో ఇంటినుంచి పారిపోయాడు. రైల్వే స్టేషన్ లో వాటర్ బాటిళ్లు అమ్ముకున్నాడు. అప్పుడే తిరుపతిలో డాక్టర్ గా పనిచేసే పురుషోత్తం రెడ్డి పరిచయం అయ్యాడు. ఆ డాక్టర్ పరిచయంతో ఏకంగా డాక్టర్ అయ్యి ఇన్నాళ్లుగా ఎవరి కంట పడకుండా వైద్య సేవలందిస్తున్నాడు. తాజాగా అతడి భార్య ఇతగాడి ఆగడాలకు విసుగు చెంది.. మోసాలు భరించలేక చేసిన […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 02:09 PM IST
    Follow us on

    అతడి పేరు వీరగంధం తేజ. స్వస్థలం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బొడ్డువారిపాలెం.  చదివింది 5వ తరగతి.. అక్కడిదాకే చదివి 2005లో ఇంటినుంచి పారిపోయాడు. రైల్వే స్టేషన్ లో వాటర్ బాటిళ్లు అమ్ముకున్నాడు. అప్పుడే తిరుపతిలో డాక్టర్ గా పనిచేసే పురుషోత్తం రెడ్డి పరిచయం అయ్యాడు. ఆ డాక్టర్ పరిచయంతో ఏకంగా డాక్టర్ అయ్యి ఇన్నాళ్లుగా ఎవరి కంట పడకుండా వైద్య సేవలందిస్తున్నాడు. తాజాగా అతడి భార్య ఇతగాడి ఆగడాలకు విసుగు చెంది.. మోసాలు భరించలేక చేసిన ఫిర్యాదుతో ఈ ఫేక్ నకిలీ డాక్టర్ గుట్టు రట్టు అయ్యింది. ఆ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    Also Read: తొలి టీకాకు బ్రాండ్ అంబాసిడర్ భారతీయ మహారాణులే..!

    తిరుపతి డాక్టర్ పురుషోత్తం రెడ్డి ఇంటినుంచి పారిపోయిన వీరంగంధ తేజను రైల్వే స్టేషన్లో చూసి చేరదీసి తన ఊరికి తీసుకెళ్లి తిరుపతి రైల్వే క్యాంటీన్ లో ఉపాధి కల్పించాడు. 2008-2011 వరకు తేజ అక్కడే పనిచేశాడు. తర్వాత తన ఊరు వెళ్లిపోయాడు. ఓటర్ కార్డ్ తీసుకొని తన పేరును ఎండునూరి సందింటి తేజరెడ్డిగా మార్చుకున్నాడు.

    ఆ తర్వాత లక్ష వరకు ముట్టజెప్పి 10వ తరగతి, ఇంటర్ నకిలీ సర్టిఫికెట్స్ ను సంపాదించాడు. ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ను రూ.5 లక్షలతో సంపాదించాడు. ఢిల్లీలో ఎస్ఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రణ్ వీర్ సిన్హా సహకారంతో ఈ సర్టిఫికెట్ సాధించాడు. పండిట్ దీన్ దయాళ్ మెడికల్ సైన్స్ కాలేజీ రాయ్ పూర్ నుంచి 2010-2014 వరకు ఎంబీబీఎస్ చదివినట్టు సృష్టించాడు.

    ఆ తర్వాత బెంగళూరులోని సప్తగిరి ఆసుపత్రిలో జూనియర్ డీఎంవోగా 2016లో పనిచేశాడు. ఆ సమయంలోనే ఐపీఎస్ అధికారినంటూ చెప్పుకొని తిరిగి జైలుకు వెళ్లాడు. తిరిగి వచ్చాక కూడా బుద్దిమారలేదు.

    ఆ తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు. డాక్టర్ అవినాష్ రెడ్డిగా పేరు మార్చుకొని చెలామణి అయ్యాడు..  . హైదరాబాద్ బోడుప్పల్ లోని వెస్ట్ బాలాజీ హిల్స్ లో వీరగంధం తేజ  హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేశాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కోవిడ్ కంట్రోల్ రూమ్ వైద్యునిగా పనిచేశాడు.

    Also Read: అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?

    మాట్రిమోని సైట్ లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. తాను డాక్టర్ అంటూ బీడీఎస్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతడి గురించి ఆమె తెలుసుకుంది. మోసగాడితో ఉండలేనని భావించి విడిగా ఉంటోంది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తేజను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి డాక్టర్ అయ్యేందుకు సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

    నిజానికి రాచకొండ పోలీస్ కంట్రోల్ రూంలో పనిచేసే సమయంలోనే తన పేరు వైఎస్ తేజ రెడ్డి అని తాను సీఎం జగన్ బంధువునని పోలీసులకే కలరింగ్ ఇచ్చాడు. అప్పుడే పోలీసులు నజర్ పెట్టారు. అతడి భార్య ఫిర్యాదుతో ఈ 5వ తరగతి చదివి డాక్టర్ గా ఇన్నాళ్లుగా చెలామణి అవుతున్న వీరగంధం తేజ బండారం బయటపడింది.