https://oktelugu.com/

YS Sharmila: మళ్లీ వైఎస్ఆర్ పరిపాలన రావాలి..కేసీఅర్ పాలన పోవాలి.. సాధ్యమవుతుందా?

YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రా ఆడకూతురు తెగ కష్టపడుతోంది. ఎండా వానా లెక్కచేయకుండా తెలంగాణ అంతటా కలియతిరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. సూర్యాపేట మండలం బిబి గూడెం గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పథకం బ్రహ్మాండంగా అమలైందని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ పరిపాలన ఇప్పుడు లేదని […]

Written By:
  • NARESH
  • , Updated On : June 29, 2022 / 02:13 PM IST
    Follow us on

    YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రా ఆడకూతురు తెగ కష్టపడుతోంది. ఎండా వానా లెక్కచేయకుండా తెలంగాణ అంతటా కలియతిరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. సూర్యాపేట మండలం బిబి గూడెం గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

    వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పథకం బ్రహ్మాండంగా అమలైందని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ పరిపాలన ఇప్పుడు లేదని ఆవేదన చెందారు. మళ్లీ వైఎస్ఆర్ పరిపాలన రావాలి.. కేసీఆర్ పాలన పోవాలంటూ శపథం చేశారు. . 8 ఏళ్లుగా కేసీఅర్ ఏ పథకాన్ని నిలబెట్టలేదు. . ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు…ఆరోగ్య శ్రీ లేదంటూ నాన్న పథకాలను షర్మిల వల్లెవేశారు. . రుణమాఫీ లేదని.. సున్నా వడ్డీకి రుణాలు లేవని ఆక్షేపించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని మోసం చేశారని.. ఇంటికో ఉద్యోగం ..నిరుద్యోగ భృతి ఏమైందని ధ్వజమెత్తారు. YSR సంక్షేమం కోసమే రాజన్న బిడ్డ పార్టీ స్థాపించిందని తనను ఎన్నుకోవాలంటూ షర్మిల ప్రజలను కోరారు.

    షర్మిల ఎంత గింజుకున్నా ప్రస్తుతం టీఆర్ఎస్ ను కాదంటే బీజేపీ, కాంగ్రెస్ లకు తప్ప ఈమె పార్టీకి ప్రజల్లో ఆదరణ కష్టమే. ఎందుకంటే కాలికి బలపం కట్టుకొని తిరిగినా ఈ ఆంధ్రా ఆడకూతురుకును గెలిపించే స్థితిలో ప్రజలు లేరు. కేవలం ఖమ్మం జిల్లాలో మాత్రమే.. అది ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాల్లో షర్మిల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఎంత వైఎస్ఆర్ పరిపాలన రావాలన్న అది కష్టమేననడంలో సందేహం లేదు.

    ‘మహిష్మతి బాహుబలిని మరిచిపోయింది దేవసేన’ అన్నట్టు.. ఇప్పుడు వైఎస్ఆర్ ను ప్రజలంతా మరిచిపోయారు. ఆయన సెంటిమెంట్ తో ఓట్లు అడిగే బదులు.. అభివృద్ధి చేస్తానని.. ప్రజలు, నిరుద్యోగులు ఇలా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళితే షర్మిలకు కాస్తంత అయినా ఇమేజ్ ఉంటుంది