YS Sharmila: తెలంగాణలో ధరణి పోర్టల్ లో ఎన్నో తప్పులు దొర్లుతున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ధరణి పోర్టల్ లో తమ భూమి కానరాకుండా పోవడంతో అధికారుల చుట్టు తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రజాప్రతినిధులను కలిసినా లాభం ఉండటం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఫలితంగా తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
సంవత్సరాలుగా తమ భూమి సమస్యలు తీరకపోవడంతో రైతులకు ఏం చేయాలో కూడా తోచడం లేదు. రైతుబంధు రాకపోవడంతో పెట్టుబడికి కూడా డబ్బు దొరకడం లేదు. దీంతో భూమి సాగు చేయడానికి కూడా తిప్పలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు తమ ప్రాణాలే తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదు.
ఒకరి భూమి మరొకరిపై కూడా ఉంటోంది. దీంతో వారికి ఏం చేయాలన్నా వారి చేతిలో ఏం ఉండటం లేదు. దీంతో వారి ఇబ్బందులు తీరడం లేదు. ఎన్ని రోజులైనా సమస్య మాత్రం తీరే దారి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వర్ల్ మండలం దండుపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చింతల స్వామి కుటుంబాన్ని వైఎస్సార్ టీపీ అధినేత షర్మిళ పరామర్శించి ఓదార్చారు.
Also Read: Movie Ticket Prices: టికెట్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసిన హైకోర్టు!
దీంతో షర్మిల టీఆర్ఎస్ పార్టీ నిప్పులు చెరిగారు. రాష్ర్టంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని దుయ్యబట్టారు. కేసీఆర్ సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. అన్నదాతల గోడు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రైతులను నట్టేట ముంచుతున్న కేసీఆర్ పాలనకు త్వరలోనే చరమగీతం పాడతారని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ భూస్థాపితం కాక తప్పదని అన్నారు.
Also Read: YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఇన్ని ట్విస్టులా? చివరకు కూతురుపైనే నెపమా?