YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని శపథంతో రాజకీయ పార్టీ స్థాపించిన షర్మిల ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. సుమారు సంవత్సరం పాటు పాదయాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఆమె టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగుల సమస్యలపై దీక్షలు చేపట్టిన ఆమె ఇప్పుడు రాష్ర్టవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు ముందుకు కదులుతున్నారు.

వైఎస్సార్ టీపీ ని స్థాపించి నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఎంచుకున్న పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఆమె చేస్తున్న విమర్శలకు అన్ని పార్టీలు స్పందించడం లేదు. అసలు షర్మిల పార్టీని పార్టీగానే గుర్తించడం లేదని తెలుస్తోంది. అందుకే ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా ఏం కాదనే ఉద్దేశంతోనే నేతలు మిన్నకుండిపోతున్నారని సమాచారం.
మరోవైపు షర్మిల పార్టీలో ఇప్పటి వరకు నేతలెవరు చేరకపోవడంపై కూడా అనుమానాలు వస్తున్నాయి. ఆమె పార్టీ అంత బలమైనదే అయితే పలు పార్టీ ల నుంచి నేతలు ఇప్పడికే చేరే వారు కదా అని అంటున్నారు. దీంతోనే ఆమె పాదయాత్ర చేసినా లైట్ గా తీసుకుంటున్నారు. ఆమె సంతోషం కోసం చేసుకుంటున్నారని పెదవి విరుస్తున్నారు. దీంతో షర్మిల రాష్ర్టంలో ఏ మేరకు ప్రభావం చూపిస్తారో తన సత్తా ద్వారా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది.
Also Read: Delhi: ఏంట్రా ఇదీ.. గుట్కా కోసం కత్తులతో చంపుకున్నారు..
పెద్ద పార్టీల నేతలైతే షర్మిల పార్టీని పట్టించుకోవడం లేదు. ఆమెతో ఏమవుతుందనే ఏమరుపాటుతోనే ఉంటున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణలో ప్రభావం చూపుతారా? అధికారం కోసం ఎంత మేర విజయం సాధిస్తారు? ఆమెతో నడిచే వారెవరు? అనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. దీంతో ఆమె పార్టీ తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపదనే విషయం అందరిలో కనిపిస్తోంది.
Also Read: Pegasus: పెగాసస్ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కేంద్రానికి షాక్