Pegasus: దేశంలో సంచలనం సృష్టించిన వ్యవహారంలో కేంద్రం ఇప్పుడు ఇరుక్కుంది. మోడీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. పెగాసస్ తతంగంలో మోడీ సర్కారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఉగ్రవాదులపై నిఘా కోసం ఉద్దేశించిన స్పైవేర్ ను ప్రతిపక్ష నేతలు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులపై వాడారనే ఆరోపణలతో గతంలో జరిగిన పార్టమెంట్ సమావేశాల్లో సభ దద్దరిల్లింది. దీంతో దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
దేశభద్రతతో ముడిపడి ఉన్న అంశం అయినందునే విచారణకు అనుమతించలేమని అప్పట్లోనే ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ప్రతిపక్షాలు మాత్రం వినిపించుకోలేదు. పెగసస్ వ్యవహారంలో కేంద్రం తప్పుడు విధానాలు అవలంభించిందని దుయ్యబట్టాయి. విచారణ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో విషయం కాస్త సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడంతో కేంద్రం విచారణకు ఒప్పుకుంది.
పెగాసస్ వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు ఓ స్వతంత్ర దర్యాప్తు కమిటీని నియమించింది. ఇజ్రాయెల్ కు చెందిన ప్రైవేటు సంస్థ ఎస్ఎస్ వో రూపొందించిన స్పైవేర్ పెగాసస్ ను పలు దేశాలకు అందజేసింది. అయితే ఉగ్రవాద మూలాలు కనిపెట్టేందుకు ఉద్దేశించిన దీన్ని ప్రభుత్వాలు పలు కోణాల్లో ఉపయోగించినందుకు అభాసుపాలైంది. దీంతో దీనిపై సహజంగానే దుమారం చెలరేగింది. పెగాసస్ ను ప్రభుత్వాలే దుర్వినియోగం చేస్తే ఒప్పందాలు రద్దు చేసుకుంటామని వెల్లడించిన నేపథ్యంలో పెగాసస్ పెద్ద సంచలనంగా మారింది.
Also Read: ChandraBabu Naidu Wedding Card: చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం ఎంత తీసుకున్నాడంటే?
దీంతో దేశంలో పెగాసస్ పెను తుపాను సృష్టించింది. ప్రతిపక్షాలు గోల చేశాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ ఫోన్లు ట్యాపింగ్ కు దిగిందని దుమ్మెత్తిపోశాయి. ఈ క్రమంలో పెగాసస్ పై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణ చేసింది. ఈ కమిటీలో ఏడు అంశాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో తేలాల్సి ఉంది.
Also Read: Guntur Police: ఒంటరి మహిళలపైనే కానిస్టేబుల్ గురి.. వారి జీవితాలు బుగ్గే మరి