దేశంలో ఆల్కహాల్ సేవించే వాళ్ల సంఖ్య కోట్లలో ఉండగా చాలామంది ఆల్కహాల్ ను సేవించే సమయంలో స్పైసీ ఫుడ్స్ ను తీసుకుంటారు. ఎవరైతే తరచూ ఆల్కహాల్ ను తీసుకుంటారో వాళ్లను కొన్ని ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్కహాల్ శరీరంను డీ హైడ్రేట్ చేయడంతో పాటు శరీరంలోని ఉప్పు సమతుల్యతను దెబ్బ తీసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.
అయితే తరచూ ఆల్కహాల్ ను తీసుకునే వాళ్లు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. బీన్స్, చిక్కుళ్లు వంటి పదార్థాలను ఆల్కహాల్ తీసుకునే వాళ్లు తీసుకోకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఆల్కహాల్ తీసుకున్న వాళ్లు ఇవి తీసుకుంటే శరీరం ఐరన్ ను గ్రహించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ తీసుకున్న వాళ్లు ఉప్పు తక్కువగా ఉండే నట్స్, సలాడ్స్ ను తీసుకోవచ్చు.
ఆల్కహాల్ తీసుకున్న వాళ్లు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. పాల ఉత్పత్తుల వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆల్కహాల్ తీసుకునే సమయంలో పిజ్జా తీసుకోకూడదు. ఒకవేళ పిజ్జా తీసుకోవాలని అనుకుంటే టమోటా లేకుండా పిజ్జా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మద్యం తాగే సమయంలో చాక్లెట్ లకు దూరంగా ఉంటే మంచిది.
మద్యం తాగిన సమయంలో ఫ్రెంచ్ ఫ్రైస్ కు కూడా దూరంగా ఉంటే మంచిది. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది. తరచూ ఆల్కహాల్ ను తాగే వాళ్లు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.