షర్మిల పార్టీ ప్రకటన అప్పుడే..: తేదీ ఖరారు..?

తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఇప్పుడు వైఎస్‌ షర్మిల పేరు మారుమోగుతోంది. ఇటీవలే లోటస్‌పాండ్‌ వేదికగా నిర్వహించిన సమావేశంలో షర్మిల ఇప్పటికే పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమె.. రాజన్న రాజ్యం తెస్తానని అంటోంది. దీంతో అంతటా ఇదే చర్చ నడుస్తోంది. షర్మిల పెట్టబోతున్న పార్టీ పేరేంటి..? జెండా ఎలా ఉండబోతోంది..? అజెండా ఉండబోతోంది..? పార్టీ విధి విధానాలు ఎలా రూపొందించబోతున్నారు..? 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రే […]

Written By: Srinivas, Updated On : February 11, 2021 10:37 am
Follow us on


తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఇప్పుడు వైఎస్‌ షర్మిల పేరు మారుమోగుతోంది. ఇటీవలే లోటస్‌పాండ్‌ వేదికగా నిర్వహించిన సమావేశంలో షర్మిల ఇప్పటికే పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమె.. రాజన్న రాజ్యం తెస్తానని అంటోంది. దీంతో అంతటా ఇదే చర్చ నడుస్తోంది. షర్మిల పెట్టబోతున్న పార్టీ పేరేంటి..? జెండా ఎలా ఉండబోతోంది..? అజెండా ఉండబోతోంది..? పార్టీ విధి విధానాలు ఎలా రూపొందించబోతున్నారు..?

2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బాటలు వేసింది. అంతేకాదు.. రాజన్నకు తెలంగాణలోనూ చాలా వరకు అభిమానులు ఉన్నారు. అందుకే.. ఇక్కడ పార్టీని స్థాపించాలని షర్మిల భావించింది. దీంతో ఎంట్రీ ఇచ్చింది. ఇదే క్రమంలో పార్టీ ఎప్పుడు ప్రకటించబోతున్నారనే విషయం మీద ఓ క్లారిటీ వచ్చిందంట.

Also Read: ఆ ఇద్దరు టీఆర్ఎస్ మంత్రులే షర్మిలను నడిపిస్తున్నారా..?

షర్మిల పార్టీ ప్రకటన ప్రకటించగానే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికే పార్టీ ప్రకటన తేదీ మీద క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. మార్చి 01న షర్మిల పార్టీ పేరును ప్రకటించబోతున్నారనేది తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా.. లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి.. పార్టీ పేరును ప్రకటించాలని భావిస్తున్నారట షర్మిల. అదేరోజు పార్టీ జెండా, అజెండా వెల్లడించనున్నారని సమాచారం.

ఆ లోపు పార్టీ విధివిధానాలు, జెండాను ఖరారు చేయాలని యోచిస్తున్నారు. షర్మిల పార్టీ పేరులో వైఎస్‌తో పాటు తెలంగాణ పదాలు వచ్చేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నల్లగొండ నేలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం ముగిసింది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న ఉమ్మడి జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలు నగరంలోనే నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారు. దూరంగా ఉన్న జిల్లాలకు మాత్రం స్వయంగా వెళ్లి నిర్వహించాలని ఆమె సూత్రప్రాయంగా నిర్ణయించారు.

Also Read: తెలంగాణలో వైఎస్ షర్మిల బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారా?

ఈ నెల 21న ఖమ్మం లేదా ఆదిలాబాద్‌ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి ఆఖరులో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఒక జిల్లా సమావేశం ఉంటుందని తెలిసింది. అటు నగరంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలను లోటస్ పాండ్‌లో కాకుండే వేరొక చోట నిర్వహించాలని యోచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

అయితే.. షర్మిల పార్టీ ఏర్పాటు వార్తలపై అటు అధికార.. ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీలకు రాష్ట్రంలో భవితవ్యం ఉండదంటూ తిట్టిపోస్తున్నారు. నాలుగు రోజుల్లోనే దుకాణం సర్దేయాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్ నేతలు అంటుండగా.. కేసీఆర్ ప్రోద్బలంతోనే షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపిస్తున్నారు.