పెళ్లిలో బాసికం ఎందుకు కడతారో తెలుసా?

సాధారణంగా మన పెద్దవారు పెళ్ళంటే నూరేళ్ళ జీవితం, నూరేళ్ల పంట అని చెబుతుంటారు. అటువంటి వివాహ కార్యక్రమంలో ప్రతి ఒక్కటి ఎంతో నియమ నిష్టలతో సాంప్రదాయబద్దంగా జరిపిస్తారు. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుకే వివాహం. అయితే ఈ ముఖ్యమైన వివాహ వేడుకలో ప్రతి ఒక్క కార్యక్రమం వెనుక ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంటుంది. ఈ పెళ్లి కార్యక్రమంలో వధూవరులకు నుదిటిన బాసికం కడతారు. ఈ విధంగా వధూవరులిద్దరికీ మాత్రమే బాసికం కట్టడానికి గల కారణాలు […]

Written By: Navya, Updated On : February 11, 2021 10:59 am
Follow us on

సాధారణంగా మన పెద్దవారు పెళ్ళంటే నూరేళ్ళ జీవితం, నూరేళ్ల పంట అని చెబుతుంటారు. అటువంటి వివాహ కార్యక్రమంలో ప్రతి ఒక్కటి ఎంతో నియమ నిష్టలతో సాంప్రదాయబద్దంగా జరిపిస్తారు. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుకే వివాహం. అయితే ఈ ముఖ్యమైన వివాహ వేడుకలో ప్రతి ఒక్క కార్యక్రమం వెనుక ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంటుంది. ఈ పెళ్లి కార్యక్రమంలో వధూవరులకు నుదిటిన బాసికం కడతారు. ఈ విధంగా వధూవరులిద్దరికీ మాత్రమే బాసికం కట్టడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

Also Read: స్టాక్ మార్కెట్లో రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేసిన బుడతడు.. చివరకు..?

పెళ్లి కార్యక్రమంలో వధూవరులిద్దరికీ కళ్యాణ తిలకం దిద్ది నుదిటిపై బాసికం కట్టినప్పుడే అసలైన పెళ్లి కళ ఉట్టిపడుతుంది. అదే విధంగా ఈ బాసికం కట్టడం వెనుక కూడా ఒక శాస్త్రీయ పరమైన అర్థం దాగి ఉంది. పెళ్లిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సుముహూర్తం. ఈ సుముహూర్త సమయంలో వరుడు వధువు మెడలో మూడుముళ్లు వేస్తాడా. ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో వరుడు వధువు కనుబొమ్మల మధ్య చూడాలి.

Also Read: లేడీ కస్టమర్ కు షాకిచ్చిన డెలివరీ బాయ్.. ఏం చేశాడంటే..?

అదేవిధంగా వధువు వరుడు రెండు కనుబొమ్మల మధ్య చూడాలి. ఈవిధంగా ఒకరికొకరు చూడటం మర్చిపోకుండా దృష్టి పక్కకు వెళ్ళకుండా ఉండడం కోసం నుదుటిపై బాసికం కడతాడు. ఈ విధంగా ఒకరినొకరు చూసుకోవడం వల్ల వారిద్దరికీ ఒకరి పై ఒకరికి ఆకర్షణ కలిగి వారిద్దరూ ఇకపై జీవితంలో ఒక్కటేనన్న భావన కలిగి సంసార జీవితంలో ఎటువంటి కలహాలు, మనస్పర్థలు లేకుండా నూరేళ్లు జీవించాలని అర్థం. అందుకోసమే పెళ్లిలో వధూవరులిద్దరూ నుదటి పైన బాసికం కడతారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం