https://oktelugu.com/

సుజనా గప్‌చుప్‌..: ఎందుకు సైలెంట్‌ అయినట్లు..!

కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంటారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు కామెంట్లు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగడుతూనే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని పదే పదే హెచ్చరిస్తుంటారు. Also Read: చిక్కుల్లో సుజనా.. ఈడీ నోటీసులు.. బీజేపీ చేరినా కనికరం లేదే? కానీ.. కొన్ని నెలలుగా సుజనా చౌదరి సౌండ్ ఏపీ రాజకీయాల్లో వినిపించడం […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 11, 2021 10:43 am
    Follow us on

    Sujana Chowdary
    కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంటారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు కామెంట్లు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగడుతూనే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని పదే పదే హెచ్చరిస్తుంటారు.

    Also Read: చిక్కుల్లో సుజనా.. ఈడీ నోటీసులు.. బీజేపీ చేరినా కనికరం లేదే?

    కానీ.. కొన్ని నెలలుగా సుజనా చౌదరి సౌండ్ ఏపీ రాజకీయాల్లో వినిపించడం లేదు. సుజనా చౌదరి ఫక్తు టీడీపీ నేత. సుజనా చౌదరికి టీడీపీయే రాజకీయ బిక్ష పెట్టింది. అందులోనూ చంద్రబాబుకు ఆయన అతిసన్నిహితుడు. 2004 నుంచి 2014 వరకూ టీడీపీ అధికారంలో లేకపోయినా సుజనా చౌదరి చంద్రబాబు వెన్నంటే నడిచారు. ఆయనకు ఆర్థికంగానూ వెన్నుదన్నుగా నిలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూసిన తర్వాత సుజనా చౌదరి అనూహ్యంగా బీజేపీలో చేరిపోయారు. తనపైన ఉన్న ఆర్థికపరమైన కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీలో చేరారు.

    Also Read: రెండో విడతలోనూ నిమ్మగడ్డకు షాకే.. జగన్ కు ఊరట..

    బీజేపీలో చేరినా సుజనా చౌదరి వైసీపీ ప్రభుత్వాన్నే టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో ఆయన రైతులకు అండగా నిలిచారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారానికి ఒక సారి ఏపీలో పర్యటించేవారు. జిల్లాల్లో పార్టీ శ్రేణులతో కలిసి నడిచేవారు. కానీ.. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి ఆయన ఏపీలోకి అడుగుపెట్టలేదు. దీనికితోడు సుజనా చౌదరికి చెందిన వారిని కూడా సోము వీర్రాజు పక్కన పెడుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    అలాగే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌‌తో పార్క్ హయత్ హోటల్‌లో సుజనా చౌదరి భేటీ కావడం కూడా అప్పట్లో సంచలనం కలిగించింది. అయితే ఇప్పుడు నిమ్మగడ్డపై వైసీపీ ప్రభుత్వం మాటల దాడులకు దిగుతున్నా సుజనా చౌదరి మాత్రం స్పందించడం లేదు. పంచాయతీ ఎన్నికల విషయంలోనూ ఆయన పట్టించుకోవడంలేదు. కేవలం రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై అసహనంతోనే సుజనా చౌదరి రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం లేదని చెబుతున్నారు.