పోలీసుల ఆక్షేపణ.. లెక్కచేయని షర్మిల

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించేది లేదని నిరూపించుకున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇందిరాపార్కు, ధర్నా చౌక్ వద్ద మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికి తన ఇంటి వద్దే దాన్ని కొనసాగించారు. తన లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈక్రమంలో ఎదురైన అవాంతరాలను అధిగమించగలిగారు. తాజాగా ఆమె తలపెట్టిన వికారాబాద్ జిల్లా పర్యటనను పోలీసులు అడ్డుకున్న వెనుకంజ వేయలేదు. వికారాబాద్ జిల్లాలో అడుగుపెట్టారు. […]

Written By: Srinivas, Updated On : June 11, 2021 6:50 pm
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించేది లేదని నిరూపించుకున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇందిరాపార్కు, ధర్నా చౌక్ వద్ద మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికి తన ఇంటి వద్దే దాన్ని కొనసాగించారు. తన లక్ష్యాన్ని పూర్తి చేశారు.

ఈక్రమంలో ఎదురైన అవాంతరాలను అధిగమించగలిగారు. తాజాగా ఆమె తలపెట్టిన వికారాబాద్ జిల్లా పర్యటనను పోలీసులు అడ్డుకున్న వెనుకంజ వేయలేదు. వికారాబాద్ జిల్లాలో అడుగుపెట్టారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పలకరించారు. రైతులకు భరోసా కల్పించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని లోటస్పాండ్ నివాసం నుంచి కారులో పరిగికి బయలుదేరారు. ఆమె వెంట సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పార్టీ సన్నాహక కమిటీ నాయకులు ఉన్నారు. మార్గమధ్యలో చేవెళ్లలోని చింతపల్లి వద్ద వైఎస్ షర్మిల కారును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు అమర్చారు. ముందుకు సాగడానికి వీల్లేదని చెప్పారు. ఈసందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పరిగి నియోజకవర్గం పరిధిలోని దోమ మండలం పోలేపల్లి, ఇతర గ్రామాల్లో షర్మిల పర్యటించారు. భారీ వర్షాలకు తడిచి మద్దయిన వరి కుప్పలను పరిశీలించారు. ైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికారులు అంగీకరించట్లేదని కనీస మద్దతు కల్పించకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోయారు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ నిరాకరించలేదని అలాంటప్పుడు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు.