https://oktelugu.com/

షర్మిలకు ఆదిలోనే అడ్డంకులు..

వైఎస్ షర్మిలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయా..? ఏమో చెప్పలేం.. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితిని గమనిస్తుంటే.. అలాగే అనిపిస్తోంది. ఏప్రిల్ 9న షర్మిల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభలో పార్టీపేరు ప్రకటిస్తానని చెప్పింది. పార్టీ విధివిధానాలు నిర్ణయిస్తానని చెప్పింది. బహిరంగసభ కోసం పోలీసులు అనుమతి ఇచ్చారని కూడా అనుమతి వచ్చింది. సో.. ప్రభుత్వం పరంగా షర్మిలకు అడ్డంకులు లేవు. అయితే ఆమె సభకు ఇబ్బందులు ఎదురవుతాయని అనుమానాలు రావడానికి కారణం తెలంగాణలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 21, 2021 / 03:47 PM IST
    Follow us on


    వైఎస్ షర్మిలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయా..? ఏమో చెప్పలేం.. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితిని గమనిస్తుంటే.. అలాగే అనిపిస్తోంది. ఏప్రిల్ 9న షర్మిల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభలో పార్టీపేరు ప్రకటిస్తానని చెప్పింది. పార్టీ విధివిధానాలు నిర్ణయిస్తానని చెప్పింది. బహిరంగసభ కోసం పోలీసులు అనుమతి ఇచ్చారని కూడా అనుమతి వచ్చింది. సో.. ప్రభుత్వం పరంగా షర్మిలకు అడ్డంకులు లేవు.

    అయితే ఆమె సభకు ఇబ్బందులు ఎదురవుతాయని అనుమానాలు రావడానికి కారణం తెలంగాణలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా. కేవలం తెలంగాణలోనే కాదు.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. ప్రధాన మంత్రి మోదీ కూడా ఈ మధ్య ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కరోనా నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు విధించారు. తెలంగాణలోనూ లాక్ డౌన్ విధిస్తారేమోననే అనుమానం వ్యక్తం అవుతోంది.

    Also Read: మళ్లీ లాక్ డౌన్..?

    ఇప్పటికే పొరుగున ఉన్న మహారాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఇంకా అనేక రాష్ట్రాల్లోనూ కరోనా నివారణకు ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే సీఎంలు కరోనా వ్యాప్తిని అరికట్టాలని సలహా ఇచ్చారు. వాస్తవానికి ఈనెల 22 నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పునరాలోచనలో పడింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు వచ్చేనెల 9వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తాను రాజకీయ అరంగేట్రం చేయాలన్న ఆలోచనతో ఉన్న షర్మిలకు ఉన్న అడ్డంకులు కలుగుతాయా..? ఒకవేళ కేసులు పెరిగిన పక్షంలో ప్రభుత్వం నిబంధనలు విధించే అవకాశం ఉంది. ఆ పరిస్థితి వస్తే.. మరికొంతకాలం ఆగాల్సి వస్తుంది. ఇప్పటికే బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలని జిల్లా నాయకులతో పలుమార్లు చర్చించింది షర్మిల.