గతంలో మంత్రి మండలికి అధికారులు 52,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వెల్లడించడం జరిగింది. అయితే సీఎం కేసీఆర్ జాబితాను సమగ్ర సమాచారంతో సక్రమంగా జాబితా ఇవ్వాలని అధికారులను ఆదేశించగా ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేసి 67,820 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు వెల్లడించాయి. ఆర్థిక శాఖ ఈ నెలలో జరిగే మంత్రి మండలి సమావేశంలో నివేదికను సమర్పించనుందని సమాచారం.
మంత్రి మండలి ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్లకు అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సీఎం కేసీఆర్ 50,000 ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళిలు ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
దాదాపుగా 70 వేల ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్లను వేగంగా రిలీజ్ చేయాలని నిరుద్యోగులు అభిప్రాయలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.