YS Sharmila Opinion on AP Politics: తెలంగాణ రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చిన షర్మిల.. మొదటి నుంచి చురుగ్గానే ఉంటున్నారు. తెలంగాణ యాస తెలుసు, భాష తెలుసని, తాను తెలంగాణ ఇంటి కోడలిని అంటూ లోకల్ ముద్ర వేసుకునే పనిలో బాగానే ప్రయత్నిస్తున్నారు. ఇక యూత్ ను తనవైపు తిప్పుకునేందుకు నిరుద్యోగుల తరఫున బాగానే దీక్షలు, యాత్రలు అంటూ పోరాడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె ఏపీలో పార్టీ పెడుతుందా అనే అనుమానాలు ఎప్పటి నుంచో చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకంటే ఆమె ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలే కారణం.
ఆమె ఓ సారి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏపీలో పార్టీ పెట్టకూడదా ? అంటూ మాట్లాడటంతో.. ఆమెకు ఏపీలో పార్టీ పెట్టే ఆలోచన ఉందంటూ పుకార్లు లేచాయి. ఇక ఏపీ రాజకీయాల్లో కూడా చాలామంది ఆమె వ్యాఖ్యల మీద స్పందించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కూడా ఆమె జనగ్‌కు వ్యతిరేకంగా పార్టీ పెడుతారంటూ వైసీపీలో పెద్ద దుమారమే లేచింది. ఇక మీడియా కూడా వీటిమీద అనేక రకాలుగా వార్తలు రాయడం స్టార్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఏపీ రాజకీయాలపై తనకున్న అభిప్రాయాన్ని తేల్చి చెప్పేశారు.
Also Read: ఏపీ రోడ్లపై తిరిగితే బాడీ మసాజ్ అయిపోతుంది.. సోము సెటైర్లు మామూలుగా లేవండోయ్..
రీసెంట్ గా ఏపీలో కొత్త జిల్లాలను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె మీడియా ముందకు రాగా.. ఓ మీడియా ప్రతినిధి కొత్త జిల్లాల ఏర్పాటు మీద, జగన్ నిర్ణయం మీద షర్మిలను ప్రశ్న అడగబోయాడు. అయితే అతన్ని పూర్తిగా చెప్పనివ్వకుండా వారించి, ఆ విషయాలు వద్దన్నట్టు సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆమెకు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని తేలిపోయిది. తనకు ఏపీ రాజకీయాల మీద ఆసక్తి లేదని చాలా క్లియర్ గా చెప్పేసిందని అంటున్నారు నిపుణులు.
తన ఫోకస్ మొత్తం తెలంగాణ రాజకీయాల మీదనే ఉందని, తండ్రికి ఉన్న పేరును చెప్పుకుని, తనకు మద్దతు దారులను పెంచుకోవాలని షర్మిల ప్రయత్నిస్తోంది. త్వరలోనే తన పోరును మరింత వేగవంతం చేయాలని షర్మిల భావిస్తున్నారు. కరోనా కేసులు ఉండటంతో జిల్లాల్లో పర్యటనలు ఆపేశారు. త్వరలోనే వీటికి మళ్లీ శ్రీకారం చుట్టే పనిలో పడుతున్నారు షర్మిల.
Also Read: తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్ కోసం పోటీ..!