https://oktelugu.com/

AP Employees: ఏపీ ఉద్యోగుల్లో టెన్షన్.. వేతనాలు సమయానికి అందుతాయా?

AP Employees: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య లొల్లి చల్లారడం లేదు. రెండు వైపుల నుంచి పట్టు గట్టిగానే పడుతున్నారు. దీంతో రాష్ర్టంలో ప్రజాపనుల నిర్వహణ ముందుకు సాగడం లేదు. ఫలితంగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పొడచూపిన విభేదాలు తారా స్థాయికి చేరాయి. తగ్గేదేలే అంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పనుల నిర్వహణ మాత్రం అర్థంతరంగా ఆగిపోయింది. పనులు సాగాలంటే ఉద్యోగులు విధులకు హాజరవ్వాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది. వీరి మధ్య కొత్త పీఆర్సీ గొడవలకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 27, 2022 5:26 pm
    Follow us on

    AP Employees: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య లొల్లి చల్లారడం లేదు. రెండు వైపుల నుంచి పట్టు గట్టిగానే పడుతున్నారు. దీంతో రాష్ర్టంలో ప్రజాపనుల నిర్వహణ ముందుకు సాగడం లేదు. ఫలితంగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పొడచూపిన విభేదాలు తారా స్థాయికి చేరాయి. తగ్గేదేలే అంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పనుల నిర్వహణ మాత్రం అర్థంతరంగా ఆగిపోయింది. పనులు సాగాలంటే ఉద్యోగులు విధులకు హాజరవ్వాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది.

    AP Employees

    AP Employees

    వీరి మధ్య కొత్త పీఆర్సీ గొడవలకు రాజేసింది. తాజాగా సమ్మె చేస్తున్న ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలుచెల్లించాలని ప్రభుత్వం చెబుుతుండగా పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏపీలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య నిప్పు రాజుకుంది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించేందుకు బిల్లులు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉద్యోగులకు తలనొప్పిగా మారుతోంది.

    Also Read: ఏపీ రాజ‌కీయాల‌పై త‌న అభిప్రాయాన్ని చెప్పేసిన ష‌ర్మిల‌..!

    దీంతో ఏపీలో వాస్తవానికి జనవరి నెలలో ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. కానీ కొత్త పీఆర్సీ ప్రకారం చూస్తే జీతాలు పెరగడం లేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినందున కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఉద్యోగుల భవిష్యత్ పై పెనుప్రభావం చూపనుందని తెలుస్తోంది.

    ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కొద్ది రోజులుగా ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పడటం లేదు. దీంతో ఉద్యోగులకు అందాల్సిన జీతాలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న అందాల్సిన వేతనాలు అందుతాయో లేదో తెలియడం లేదు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు సైతం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఉద్యోగులు, ప్రభుత్వంలో సఖ్యత నెలకొంటుందా? వారి డిమాండ్లు నెరవేరుతాయా లేదా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.

    Also Read: ఏపీ రోడ్ల‌పై తిరిగితే బాడీ మసాజ్ అయిపోతుంది.. సోము సెటైర్లు మామూలుగా లేవండోయ్‌..

    Tags