YS Sharmila : కరెక్ట్ టైమ్ లో ఎంటరైన షర్మిళ.. జగన్ శిబిరంలో ముచ్చెమటలు

వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో షర్మిళ ఎపిసోడ్ నడిచింది. షర్మిళకు మద్దతుగా వైఎస్ విజయమ్మ సైతం నడి వీధిలోకి వచ్చారు.

Written By: Dharma, Updated On : April 27, 2023 11:12 am
Follow us on


YS Sharmila :
కరెక్ట్ టైమ్ లో వైఎస్ షర్మిళ ఎంటరయ్యారా? వివేకా హత్యకేసు విషయంలో అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారా? ఆయన హత్య ఆర్థిక అంశాలతో ముడిపడినది కాదని తేల్చేశారా? ఇది పక్కా పొలిటికల్ మర్డర్ గా క్లారిటీ ఇచ్చారా? నేరుగా జగన్ రెడ్డి శిబిరానికి హెచ్చరిక సంకేతాలు పంపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విలేఖర్ల సమావేశంలో షర్మిళ మాట్లాడిన తీరు అలానే ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో షర్మిళ ఎపిసోడ్ నడిచింది. షర్మిళకు మద్దతుగా వైఎస్ విజయమ్మ సైతం నడి వీధిలోకి వచ్చారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ తెలుగుదేశం విమర్శించింది. అన్నను కష్టం నుంచి గట్టెక్కించడానికేనని ఆరోపించింది. కానీ షర్మిళ మాట్లాడిన తరువాత అదంతా తప్పు అని తేలిపోయింది.

ఎన్నెన్నో అనుమానాలు
వివేకా హత్య కేసులో ఒక కోణంలో చూస్తున్నారు.. లోతైన కారణాలను అన్వేషించడం లేదన్నది కేసులో అనుమానితులు, నిందితులు చేస్తున్న వాదన. ఇదే అంశంపై నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిట్ మార్పును కోరిన సందర్భాలున్నాయి. ప్రధానంగా వివేకా హత్య వెనుక ఆర్థికపరమైన అంశాలున్నాయని.. ఆ డాక్యుమెంట్ల కోసమేనంటూ రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. అటు రెండో భార్య షమీమ్ సైతం ఎంటరయ్యారు. వివేకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారని చెప్పుకొచ్చారు. ఏవో సెటిల్ మెంట్లు, ఇతరత్రా అంశాలను తెరపైకి తెచ్చారు. దీంతో వివేకాను రాజకీయ కోణంలో చంపలేదు.. ఆర్థికపరమైన అంశాలతో సైతం చంపే చాన్స్ కూడా ఉందని ప్రచారం కల్పించారు. ఆస్తి వేరేవారికి రాసిస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులే ఈ ఘాతుకం చేయించి ఉండొచ్చు కదా అని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.

అసలు నిజాలు ఇవంటూ..
అయితే ఇటువంటి ప్రచారానికి తాజాగా మీడియా ముందుకు వచ్చిన షర్మిల ఘాటైన రిప్లయి ఇచ్చారు. అసలు ఆస్తుల అంశమే ఆ కుటుంబంలో లేదని స్పష్టం చేసింది. వైఎస్ వివేకాకు ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడో సునీతకు రాసేశారని.. ఆయన పేరుపై ఎలాంటి ఆస్తులు లేవని షర్మిల స్పష్టం చేశారు.  సునీత భర్త ఆస్తుల కోసం చంపాలనుకుంటే.. ఆస్తులన్నీ సునీత పేరుపై ఉన్నాయి కాబట్టి సునీతనే చంపాలన్నారు. అదే సమయంలో వైఎస్ వివేకా వ్యక్తిగత జీవితంపై నిందలు వేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నాన్న వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆయన సాధారణ జీవితం గడిపారని గుర్తుచేశారు. . కొన్ని మీడియా సంస్థలు ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని  పరోక్షంగా సాక్షి గురించి ప్రస్తావించారు.చనిపోయిన వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వైరల్..
అయితే ఇప్పుడు షర్మిళ షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో షర్మిళ కేసును పక్కదోవ పట్టించడానికే ఎంటరయ్యారన్న టీడీపీ ఆరోపణ కూడా తప్పుగా తేలింది.  షర్మిళ చేసిన కామెంట్స్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు దగ్గరగా ఉన్నాయి.  అవినాష్ రెడ్డి ని కాపాడటానికి చనిపోయిన వివేకాపై అత్యంత దారుణమైన నిందల్ని వేస్తున్నారు. లేనిపోనివి ప్రచారం చేస్తున్నారు. కోర్టుల్లో దాఖలు చేసే అఫిడవిట్లలోనూ ఈ ఆరోపణలు చేస్తున్నారు. అలాగే .. వివేకా హత్యానేరాన్ని రాజశేఖర్ రెడ్డి, సునీతలపై వేయడానికి ఆస్తుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.  వీటిన్నింటిపై షర్మిళ క్లారిటీ ఇవ్వడం జగన్ వర్గానికి మింగుడుపడడం లేదు. అందుకే షర్మిళ కరెక్ట్ టైమ్ లో సీన్ లోకి ఎంటరయ్యారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.