Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: మంత్రివర్గ విస్తరణపై నే నేతల ఆశలు

YS Jagan: మంత్రివర్గ విస్తరణపై నే నేతల ఆశలు

AP Cabinet expansionYS Jagan: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆశావహులు పదవుల కోసం వేచి చూస్తున్నారు. తమకు అవకాశం వస్తుందో లేదో అనే అనుమానంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరు పదవులు కావాలని ఆశిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా మంత్రి పదవి వరించాలని ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా అధినేత జగన్ మెప్పు పొందాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాదారు 90 శాతం మందిని మారుస్తారని తెలియడంతో కొత్త ముఖాలు తమ ప్రయత్నాలకు పని చెబుతున్నారు. జగన్ దృష్టిలో పడి పదవి సాధించాలని చూస్తున్నారు.

అయితే మంత్రివర్గ విస్తరణలో జగన్ ఎవరి ప్రమేయం ఉండనివ్వరని తెలుసు. అందుకే నేరుగా ఆయన కనుసన్నల్లో పడేందుకు నేతలు తాపత్రయపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాలకే పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించేందుకు నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తవారు చాలా మంది పదవులపై ఆశలు పెంచుకుని తమ పలుకుబడి ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ తన దృష్టిలో ఉన్న వారికి మాత్రం కచ్చితంగా న్యాయం చేస్తారనే పేరుంది. ఆయన మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారనే తెలుస్తోంది. అందుకే ఆయన దగ్గర మాట తీసుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. రోజు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జపం చేస్తున్నారు. మంత్రి పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. జగన్ మెప్పు పొంది ఆయన మాట తీసుకోవాలని ముందుంటున్నారు. రాబోయే విస్తరణలో కచ్చితంగా పదవి సాధించడమే లక్ష్యంగా కదులుతున్నారు.

శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో ఎమ్మెల్సీల పదవులపై భరోసా లేకుండా పోతోంది. దీంతో మంత్రి పదవి కోసమే ఆరాటపడుతున్నారు. ఒకవేళ మండలి రద్దయితే వారి పదవులు హుష్ కాకే. దీంతో ఎమ్మెల్సీ కంటే మంత్రి పదవి కావాలనే పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జగన్ ప్రభుత్వంలో ఒక్కసారైనా మంత్రి పదవులు సాధించాలని చూస్తున్న నేతల ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే.

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version