YS Jagan- Sharmila: ఆంధ్రప్రదేశ్ లో నేతల మధ్య అభిప్రాయ బేదాలు వస్తున్నాయి. ఒక ఇంట్లోనే పలు పార్టీలు పురుడుపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ కూతురు, కుమారుడు రెండు పార్టీలు ఏర్పాటు చేసుకుని రాజకీయంగా తలో దారి చూసుకుంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటలు కూడా లేకుండా పోతున్నాయని తెలుస్తోంది. ఇవాళ జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కూడా ఇద్దరు పాల్గొనకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైఎస్ వారసుల్లో భిన్న దారులు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే జగన్ ఏపీలో అధికారంలో ఉండగా షర్మిల తెలంగాణలో వైఎస్సార్ టీపీ పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. తెలంాణలో రాజకీయంగా బలపడాలని భావిస్తున్నారు. ఇందుకోసమే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జగన్ కు షర్మిలకు మధ్య విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని షర్మిల అన్ని దారులు వెతుకుతున్నారు.
మరోవైపు క్రిస్మస్ వేడుకల్లో జగన్ తల్లితో పాటు హాజరై పులివెందులలో వైఎస్ఆర్ ఘాట్ కు నివాళులర్పించి వేడుకలు చేసుకున్నారు. షర్మిల మాత్రం హాజరు కాలేదు. గతంలో జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో కూడా అన్నా చెల్లెళ్లు కలుసుకోలేదు. దీంతో ఒకే ఇంట్లో భిన్న ధృవాలు ఉండటంతో తల్లి విజయమ్మ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇటు కొడుకు అటు కూతురుతో ఇద్దరి మధ్య ఏం మాట్లాడలేక మౌనం వహిస్తున్నారు.
దీంతో ఒకే కుటుంబంలో వైరి వర్గం ఉండటంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపుతున్నట్లు తెలుస్తోంది. తల్లి విజయమ్మ మాత్రం ఇద్దరిని బాగానే చూసుకుంటున్నా కూతురికి అధికారం రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా లోటస్ పాండ్ లో ఉండి షర్మిల రాజకీయ వ్యవహారాలు స్వయంగా పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు ఇంకా ఎంత దూరం వెళతాయో వేచి చూడాల్సిందే.