భారతీయ సినిమా అనగానే హిందీ సినిమానే ప్రధానం అన్నట్టు వచ్చింది ఇన్నాళ్లు. పైగా అమితాబ్, ఖాన్ లూ మాత్రమే ఇండియన్ సూపర్‌స్టార్లు అని ప్రచారం చేశారు. అదే మన చిరంజీవి, రజనీకాంత్, ఇక మమ్ముట్టి, మధ్యలో ఆ కన్నడ నాట ఉపేంద్ర ఎప్పటికీ సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్లే అని కూడా బాగా ప్రచారం చేశారు. అసలు మన సౌత్ హీరోలు ఎందుకు ఇండియన్ సూపర్‌స్టార్లు కాదు ?

మన వాళ్ళు కూడా ఇండియన్ స్టార్సే అని ఎప్పటికీ ఒప్పుకోరా ? అని ఇన్నాళ్లు ఓ చిన్న వెలితి ఉంది. అయితే, వినేవాడు ఉంటే ఎన్నయినా చెబుతారు. నిజానికి ఇండియన్ సూపర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్న అమితాబ్, ఖాన్ సినిమాలు ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతాయి ? ఖాన్ బాబులు కాబట్టి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, దుబాయి వంటి దేశాలలో రాణిస్తున్నారు.
కానీ దక్షిణాదిన వారి చిత్రాలు విపరీతంగా ఆడిన చరిత్ర అయితే లేదు. నిజమే చిరంజీవి, మమ్ముట్టి ఉపేంద్ర సౌత్ స్టార్స్ ఒప్పుకుందాం. దేశం అంతా అయితే నిజంగా డిమాండ్ లేదు కాని పక్క రాష్ట్రాలలో బాగుంటే సినిమా మాత్రం చూస్తారు. మరి రజనీకాంత్ గురించి తెలిసి చెప్పారో, తెలియయక చెప్పారో కానీ రోబో అప్పటి షారుక్, సల్మాన్, అమీర్ సినిమాలకి పెద్దగానే గూటం పెట్టింది కలెక్షన్ పరంగా చూసుకుంటే.
ఆసియా దేశాలలో, యూరోప్ , అమెరికాలో కూడా రజనీ కి డై హార్డ్ ఫాన్స్ ఉన్నారు కదా. ఎన్ని హిందీ సినిమాలు పాన్ ఇండియాలో ప్లాన్ చేసి దక్షిణాది రాష్ట్రాలలో ప్రమోట్ చేస్తున్నారు. కానీ మొన్న రోబో, నిన్న బాహుబలి, ఇవాళ కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలను పరిగెత్తుకొచ్చి కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇండియన్ సూపర్ స్టార్లు అనగానే ఇక నుంచి ముందుగా చెప్పాల్సింది, రజినీకాంత్ ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ పేర్లనే.