https://oktelugu.com/

కూతురుతో ప్రేమ.. ఆపై ఆత్మహత్య

వరుసకు కూతురుతో యువకుడు ప్రేమ. తెలిసీ తెలియని వయసులో వావివరుస మరిచి ఆకర్షణకు లోనై.. అదే ప్రేమ అనుకున్నాడు. కన్నవారు కాదనడంతో కానరాని లోకాలకు వెళ్లి కన్నీళ్లు మిగిల్చాడు. కలికిరి మండలం,గుండ్లూరు పంచాయతీ లోవింత సంఘటన చోటుచేసుకుంది. చిత్తూరుజిల్లా, కలికిరి మండలం,గుండ్లూరు పంచాయతీ కొర్ణమిట్టపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్యకుమారుడు అశోక్ కుమార్ (23) తిరుపతి లో ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. తన పెద్దనాన్న మనవరాలు(వరుసకు కూతురు)అయిన అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు. ఈ ప్రేమ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : August 9, 2021 / 10:56 AM IST
    Follow us on

    వరుసకు కూతురుతో యువకుడు ప్రేమ. తెలిసీ తెలియని వయసులో వావివరుస మరిచి ఆకర్షణకు లోనై.. అదే ప్రేమ అనుకున్నాడు. కన్నవారు కాదనడంతో కానరాని లోకాలకు వెళ్లి కన్నీళ్లు మిగిల్చాడు. కలికిరి మండలం,గుండ్లూరు పంచాయతీ లోవింత సంఘటన చోటుచేసుకుంది.

    చిత్తూరుజిల్లా, కలికిరి మండలం,గుండ్లూరు పంచాయతీ కొర్ణమిట్టపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్యకుమారుడు అశోక్ కుమార్ (23) తిరుపతి లో ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. తన పెద్దనాన్న మనవరాలు(వరుసకు కూతురు)అయిన అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు. ఈ ప్రేమ విషయం అశోక్ తల్లిదండ్రులు తెలిసి అతడిని మందలించారు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.

    తర్వాత తిరుపతికి వెళుతున్నానని చెప్పి కలికిరి మాదిగపల్లె సమీపంలోని అంకాలమ్మ కొండ వద్ద పురుగుల మందు తాగి మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం స్థానికులు మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కలికిరి SI లోకేష్ రెడ్డి, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.