రెడ్ జోన్ అంటే తెలుసా…?

దేశంలో కరోనా కేసులు వెలుగు చూసినప్పటి నుండి రెడ్ జోన్ అనే పదం తరుచుగా వింటున్నాం. రెడ్ జోన్ అంటే ఏమిటనే ప్రశ్న అందరిలోను తలెత్తుతుంది. ప్రభుత్వ సూచనల ప్రకారం కరోనా బాధితుడిని గుర్తించిన మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని రెడ్ జోన్ గా పరిగణిస్తారు. ఈ రెడ్ జోన్ లో మూడు విభాగాలు ఉంటాయి. కరోనా బాధితుడు గుర్తించబడిన 150 మీటర్ల పరిధిని అతి తీవ్రమైన ప్రాంతంగా పరిగణిస్తారు. అక్కడి నుండి ఒకటిన్నర కిలోమీటర్ పరిధిని […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 12:14 pm
Follow us on


దేశంలో కరోనా కేసులు వెలుగు చూసినప్పటి నుండి రెడ్ జోన్ అనే పదం తరుచుగా వింటున్నాం. రెడ్ జోన్ అంటే ఏమిటనే ప్రశ్న అందరిలోను తలెత్తుతుంది. ప్రభుత్వ సూచనల ప్రకారం కరోనా బాధితుడిని గుర్తించిన మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని రెడ్ జోన్ గా పరిగణిస్తారు. ఈ రెడ్ జోన్ లో మూడు విభాగాలు ఉంటాయి. కరోనా బాధితుడు గుర్తించబడిన 150 మీటర్ల పరిధిని అతి తీవ్రమైన ప్రాంతంగా పరిగణిస్తారు.

అక్కడి నుండి ఒకటిన్నర కిలోమీటర్ పరిధిని అతి సున్నితమైన ప్రదేశంగా గుర్తిస్తారు. మిగిలిన ఒకటిన్నర కిలో మీటర్ల ప్రాంతాన్ని కూడా హై అలెర్ట్ జోన్ గా నిర్దేశిస్తారు. మొదటి 150 మీటర్ల పరిధిలో ఉన్న ప్రతీ ఒక్కరికీ పరీక్షలు చేస్తారు.
సెకండ్, థర్డ్ జోన్ లో ఉన్న వారికి ప్రతీ రోజు రెండు పూటలా ఇంటింటా సర్వే చేస్తారు.

ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కలిగి ఉంటే వారికి నమూనా పరీక్షలు చేస్తారు. ఈ మూడు జోన్లలో ప్రతీ రోజు మూడు పూటలా శానిటేషన్ మెరుగుపరిచి బ్లీచింగ్ చల్లుతారు. ఇతర ప్రాంతాల వారిని ఈ రెడ్ జోన్ పరిధిలోకి రానివ్వరు. రెడ్ జోన్ పరిధిలో ఉన్నవారిని ఇతర ప్రాంతాలకు వెళ్ళనివ్వరు.