అదే జరిగితే కాబోయే ప్రధాని యోగినా?

రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ గుండెకాయలాంటిది. ఎందుకంటే దేశంలో అత్యధిక లోక్ సభ స్థానాలున్న రాష్ర్టంగా వినతికెక్కింది. ఏ పార్టీ అయినా ఇక్కడే తన ప్రభావాన్ని చూపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక వైపు సెకండ్ వేవ్ ప్రభావం చూపుతుండగా మరో వైపు మూడో దశపై జనం భయపడుతున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ల పంపిణీ మందకొడిగా సాగుతోంది. వ్యాక్సిన్ల బాధ్యత పూర్తిగా కేంద్రమే తీసుకుంటోంది. దేశంలో అవసరాలకు తగినట్లుగా వ్యాక్సిన్ల సరఫరా అవుతాయనేది ప్రశ్నార్థకమే. […]

Written By: NARESH, Updated On : June 9, 2021 3:07 pm
Follow us on

రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ గుండెకాయలాంటిది. ఎందుకంటే దేశంలో అత్యధిక లోక్ సభ స్థానాలున్న రాష్ర్టంగా వినతికెక్కింది. ఏ పార్టీ అయినా ఇక్కడే తన ప్రభావాన్ని చూపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక వైపు సెకండ్ వేవ్ ప్రభావం చూపుతుండగా మరో వైపు మూడో దశపై జనం భయపడుతున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ల పంపిణీ మందకొడిగా సాగుతోంది.

వ్యాక్సిన్ల బాధ్యత పూర్తిగా కేంద్రమే తీసుకుంటోంది. దేశంలో అవసరాలకు తగినట్లుగా వ్యాక్సిన్ల సరఫరా అవుతాయనేది ప్రశ్నార్థకమే. వ్యాక్సినేషన్ పూర్తి చేయకపోతే కరోనా మూడో దశ కూడా విజృంభించే అవకాశాలున్నాయి. యూపీ మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ దృష్టి సారించాయి కరోనా కూడా యూపీలో ఎలా గెలవాలనే అంశంపై సంఘ్ పరివార్ కసరత్తు చేస్తోంది. యూపీలో బీజేపీ ఓడిపోతే జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీకి కౌంట్ డౌన్ మొదలవతుందని చెప్పకతప్పదు.

2014 లోక్ సభ,2017 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో సాధించిన తరహా విజయాలు బీజేపీ రిపీట్ చేయాల్సి ఉంది. అప్పుడే బీజేపీ వేవ్ గట్టిగా ఉందని అనుకుంటారు. యూపీలో పడితే బీజేపీపై రాజకీయ ధిక్కార స్వరాలు వినిపించే అవకాశాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో యూపీ కమలం పార్టీకి ప్రతిష్టాత్మక అంశంగా మారుతోంది. యోగి ప్రభుత్వ పనితీరుపై కమలం పార్టీ సమీక్షించుకోవడం అప్పుడే మొదలైంది. యోగిని దించి సీఎం పీఠంపై వేరేవారిని కూర్చోబెట్టాలనే ప్రచారాలు జరిగాయి. అయితే యోగి మాత్రం నన్నెవరు దించలేరని ప్రకటించుకున్నారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం నమోదు చేస్తే యోగీ తదుపరి అడుగులు ఢిల్లీ వైపు పడే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా ఉత్తరాది మీడియాలోనే జరుగుతూ ఉంది. దేశంలోనే అత్యధిక లోక్ సభ సీట్లున్న రాష్ర్టంలో స్వీప్ చేయగలిగితే బీజేపీలో యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయి. బీజేపీలో హిందూత్వవాదుల్లోని కొందరు కూడా మోడీ కన్నా యోగిని ప్రధానిగా చేయాలనే వారు ఉన్నారు.