తబ్లీగీ జమాత్ సభ్యులపై జాతీయ భద్రతా చట్టం

ఘజియాబాద్ ఆస్పత్రిలో నర్సులతో అసభ్యంగా ప్రవర్తించిన తబ్లీఘీలపై తీవ్ర చర్యలకు ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంకల్పించింది. వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. నర్సులతోనే కాకుండా పోలీసు, ప్రభుత్వ సిబ్బందితోనూ వారు అవమానకరంగా ప్రవర్తించారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. పరీక్షలకు సహకరించకపోగా ఇలా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం ఏమాత్రం సహించరానిదని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భావిస్తున్నది. వారందరూ మానత్వానికి శత్రువులంటూ యోగి ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడింది. ‘‘వారు చట్టానికి […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 7:36 pm
Follow us on


ఘజియాబాద్ ఆస్పత్రిలో నర్సులతో అసభ్యంగా ప్రవర్తించిన తబ్లీఘీలపై తీవ్ర చర్యలకు ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంకల్పించింది. వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది.
నర్సులతోనే కాకుండా పోలీసు, ప్రభుత్వ సిబ్బందితోనూ వారు అవమానకరంగా ప్రవర్తించారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. పరీక్షలకు సహకరించకపోగా ఇలా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం ఏమాత్రం సహించరానిదని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భావిస్తున్నది.

వారందరూ మానత్వానికి శత్రువులంటూ యోగి ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడింది. ‘‘వారు చట్టానికి బద్ధులు కాలేదు. వారు మానత్వానికి వ్యతిరేకులు కాబట్టే చట్టాన్ని గౌరవించరు. మహిళా నర్సులతో వారు ప్రవర్తించిన తీరు అత్యంత క్రూరం. వారందరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని సహించం’’ అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

జమత్ కు చెందిన 156 మందిని ఘజియాబాద్ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. వారిని కలిసిన ఇతరుల కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఎంఎంజీ ప్రభుత్వ ఆస్పత్రిలో తబ్లీఘీలు అసభ్యంగా ప్రవర్తించారని తెలియడంతో అక్కడి నుంచి మహిళా నర్సులను, మహిళా పోలీసులను ఉపసంహరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరో వంక,డాక్టర్లు, ఆరోగ్యకార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులపై దాడి కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా కేసులను గుర్తించడంలో, రక్త నమూనాలను సేకరించేటప్పుడు, హాస్పిటళ్లలో వైద్య సిబ్బందిపై జరుగుతుండటంతో వారి రక్షణకు భరోసా కల్పించాలని హోం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి పున్యా సలిల శ్రీవాత్సవ కోరారు.

అదేవిధంగా కరోనాకు సంబంధించి మరో రెండు హెల్ప్‌లైన్‌ నంబర్లు 1930, 1944 ఆమె విడుదల చేశారు. కరోనాకు సంబంధించి సందేహాలు, సమస్యలు ఉన్నా ఈ టోల్‌ఫీ నంబర్లలో సంప్రథించాలని తెలిపారు. 1930 దేశవ్యాప్తంగా టోల్‌ఫ్రీ నంబర్‌ అని, 1944ను మాత్రం ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించామని ఆమె చెప్పారు.