https://oktelugu.com/

గాజు గ్లాసు ర‌ద్దుపై ఎల్లో మీడియా అత్యుత్సాహం

ఏపీలో ఇటీవల ఓ విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో న‌వ‌త‌రం పార్టీ అభ్యర్థి గోదా ర‌మేశ్‌కుమార్‌కు గ్లాజు గ్లాసు కేటాయించి ఎన్నికల సంఘం. అయితే… తాజాగా గాజుగ్లాసు గుర్తును కేంద్ర ఎన్నిక‌ల సంఘం ర‌ద్దు చేసిన‌ట్టు నేడు టీడీపీ క‌ర‌ప‌త్రిక‌ల్లో ఓ వార్త పబ్లిష్‌ అయింది. గ్లాజుగ్లాసు గుర్తు చెప్పాలంటే జనసేన పార్టీది. ఆ పార్టీ సింబల్‌గా ఆ గుర్తును ఇచ్చారు. కానీ.. ఇప్పుడు ఈ తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ–జనసేన కూటమిగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 7, 2021 / 02:52 PM IST
    Follow us on


    ఏపీలో ఇటీవల ఓ విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో న‌వ‌త‌రం పార్టీ అభ్యర్థి గోదా ర‌మేశ్‌కుమార్‌కు గ్లాజు గ్లాసు కేటాయించి ఎన్నికల సంఘం. అయితే… తాజాగా గాజుగ్లాసు గుర్తును కేంద్ర ఎన్నిక‌ల సంఘం ర‌ద్దు చేసిన‌ట్టు నేడు టీడీపీ క‌ర‌ప‌త్రిక‌ల్లో ఓ వార్త పబ్లిష్‌ అయింది. గ్లాజుగ్లాసు గుర్తు చెప్పాలంటే జనసేన పార్టీది. ఆ పార్టీ సింబల్‌గా ఆ గుర్తును ఇచ్చారు. కానీ.. ఇప్పుడు ఈ తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ–జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. కానీ.. నవతరం పార్టీ అభ్యర్థికి గ్లాజుగ్లాసు గుర్తు కేటాయించడం చర్చకు దారితీసింది.

    అది అలా ఉంటే.. తాజాగా.. ఎల్లో మీడియా మాత్రం ఓ ఇంట్రస్టింగ్‌ వార్త రాసుకొచ్చింది. సాధారణంగా తెల్లారి పేపర్‌‌ చూస్తే ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా ఏదో ఒక వార్తను వడ్డిస్తుంటారు. కానీ.. అదేంటో కొత్తగా న‌వ‌త‌రం పార్టీ అభ్యర్థి గాజు గ్లాసు ర‌ద్దు చేశారంటూ ప్రచారాన్ని తెర‌పైకి తెచ్చింది. ఈ ప్రచారంతో అటు బీజేపీ–జనసేన కూటమిని.. ఇటు నవతరం పార్టీని కూడా అయోమయంలో పడేసే కుట్రలో భాగంగా ఎల్లో మీడియా ఇలా చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    తిరుప‌తి ఉప ఎన్నిక బ‌రిలో గాజు గ్లాసు ర‌ద్దుపై తాజా ట్విస్ట్‌గా చెప్పుకోవ‌చ్చు. ఒక వ‌ర్గం మీడియా తెలుగుదేశం ప్రయోజ‌నాల కోసం గాజు గ్లాసు ర‌ద్దు చేశారంటూ అస‌త్య ప్రచారం చేయ‌డం స‌బ‌బా అని ఆయ‌న ప్రశ్నిస్తున్నారు. ఈ దుష్ప్రచారం వ‌ల్ల ఇటు బీజేపీ–-జ‌న‌సేన కూట‌మితో పాటు త‌మ‌ను గంద‌ర‌గోళ ప‌రిచే దురుద్దేశం క‌నిపిస్తోంద‌ని ఆయ‌న వాపోతున్నారు. గ్లాజు గ్లాసు గుర్తు నవతరం పార్టీకి కేటాయిస్తే.. తమ కూటమి అభ్యర్థి రత్నప్రభకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని.. ఇప్పటికే ఆ కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

    ఈ విన‌తిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా సానుకూలంగానే స్పందించింది. కానీ.. రద్దు చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. అదేంటో గుర్తు ర‌ద్దు చేసిన‌ట్టు ఓ ప‌త్రిక వార్తను ప్రచురించడం వివాదాస్పద‌మ‌వుతోంది. అస‌లు గాజు గ్లాసు గుర్తు ర‌ద్దు చేసిన‌ట్టు ఏ అధికారి చెప్పారు..? ఎందుకు చెప్పార‌నే వివ‌రాలేవీ లేకుండా.. ఓ ప‌థ‌కం ప్రకారం ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో స‌రికొత్త ఎత్తుగ‌డ‌ల‌కు తెర‌లేపార‌నే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గాజు గ్లాసు గుర్తు ర‌ద్దుపై జిల్లా ఎన్నిక‌ల అధికారులు స్పందిస్తే త‌ప్ప వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవు.