వకీల్ సాబ్ మూవీ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ తో నెవ్వర్ బిఫోర్ రికార్డులు నెలకొల్పగా.. తాజాగా ఓపెనింగ్స్ విషయంలోనూ దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకూ ఏ సినిమాకూ లేనివిధంగా ఫస్ట్ డే టిక్కెట్లు బుకింగ్ అయిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వకీల్ సాబ్ హంగామా మామూలుగా లేదు. రెండు రాష్ట్రాల్లోని పవన్, మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు. హైదరాబాద్, విశాఖ, ఒంగోలు, కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. హైదరాబాద్ లో మొత్తం 365 ఆటలు ప్రదర్శించనున్నట్టు సమాచారం. విశాఖలో 65, ఒంగోలులో 25, గుంటూరులో 51, కడపలో 24.. ఇలా భారీ స్థాయిలో వకీల్ సాబ్ ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బి, సి, సెంటర్లలోనూ వకీల్ సాబ్ దుమ్ములేపబోతున్నట్టు సమాచారం.
ఇక, టికెట్ల విక్రయం విషయానికి వస్తే.. ఓపెనింగ్ డే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలి రోజు హైదరాబాద్ లో 96 శాతం, వైజాగ్ లో 95 శాతం పైగా ఆక్యుపెన్సీ ముందుగానే బుక్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఒంగోలులు 90 శాతం, నెల్లూరులో 100 శాతం, గుంటూరులో 80 శాతం మేర సీట్లు ఆన్ లైన్ ద్వారానే నిండిపోయాయట.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. కర్నాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కొనసాగడం విశేషం. చెన్నైలో 78 షోలు, బెంగళూరులో 153 షోలు ప్రదర్శించనుండగా.. 56 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదైందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఏ చిత్రానికీ ఇలాంటి జోరు నమోదు కాలేదని చెబుతున్నారు. మరి, సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.