https://oktelugu.com/

AP Capital Issue: ఏపీ మూడు రాజధానుల కోసం జగన్ మాస్టర్ ప్లాన్?

AP Capital Issue: అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన సాగించుకోవచ్చని కూడా బదులిచ్చారు. కానీ ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అవును మీరు చదివింది నిజమే మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టింది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి మూడు రాజధానులతో పాటు మరో రెండుఅంశాలకు సంబంధించి ప్రైవేటు బిల్లులను రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. వైసీపీ […]

Written By:
  • Dharma
  • , Updated On : August 7, 2022 / 08:44 AM IST
    Follow us on

    AP Capital Issue: అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన సాగించుకోవచ్చని కూడా బదులిచ్చారు. కానీ ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అవును మీరు చదివింది నిజమే మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టింది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి మూడు రాజధానులతో పాటు మరో రెండుఅంశాలకు సంబంధించి ప్రైవేటు బిల్లులను రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల విషయం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ పాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా చేసి.. అమవరాతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేయడానికి జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

    YSRC MP Vijayasai Reddy

    అమరావతికి మద్దతుగా తీర్పు…
    వైసీపీ సర్కారు మూడు రాజధానుల నిర్ణయంపై రాజధాని రైతులతో పాటు అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించాయి. అయినా వైసీపీ సర్కారు వెనక్కి తగ్గలేదు. మూడు రాజధానులపై ముందడుగు వేసింది. దీంతో రైతులు సుదీర్ఘ పోరాటానికి శ్రీకారం చుట్టారు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హై కోర్టు అమరావతి రాజధానికి మద్దతుగా తీర్పునిచ్చింది. మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. దీనికి గడువు సైతం ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేయలేదు. వచ్చే నెల సవాల్ కు సిద్ధపడుతున్న తరుణంలో ఇప్పుడు మూడు రాజధానులకు మద్దతుగా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు వేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. సుప్రీం కోర్టులో సైతం ప్రతికూల తీర్పు వచ్చే అవకాశమున్నందునే వైసీపీ ఈ కొత్త డ్రామాకు తెరతీసిందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.

    Also Read: AP Politics: బంగారు అవకాశాన్ని చేజార్చుకుంటున్న జగన్

    లీగల్ ఇబ్బందులను అధిగమించేందుకు..
    వాస్తవానికి చట్టప్రకారం అయితే మూడు రాజధానులను ఎట్టి పరిస్థితుల్లో నిర్మించలేరు. న్యాయస్థానం తీర్పు మేరకు విధిగా అమరావతినే రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేయాలి. అలాగని హైకోర్టు తీర్పు పై ప్రభుత్వం సవాల్ చేయడానికి సాహసించడం లేదు. వచ్చే నెలలో సుప్రీం కోర్టు తలుపుతట్టే అవకాశముందన్నవార్తలైతే మాత్రం వస్తున్నాయి. అయితే అక్కడ కూడా సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశం లేదన్న అనుమానం అయితే ప్రభుత్వానికి వెంటాడుతోంది. అందుకే ఇప్పుడు ఆదరాబాదరాగా రాజ్యాంగ సవరణకు ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీపై ఒత్తడి పెంచుతున్నారు. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా అన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది.

    Rajya Sabha

    ఎన్నికలు సమీపిస్తుండడంతో…
    రాజధాని విషయంలో వైసీపీ సర్కారు పూర్తిగా అబాసుపాలైంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టిందన్న అపవాదును మూటగట్టుకుంది. అలాగని అమరావతిని ఏకైక రాజధానిగా ఒప్పుకుంటే పరువు పోతుందని భావిస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని 20 నెలలు కూడా లేవు. ఈలోగా రాజధాని విషయం తేల్చకుంటే ఎన్నికల సమయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రాజధాని విషయంలో వైసీపీ సర్కారు పూర్తిగా ఇరుక్కుపోయిందన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో దానిని నుంచి బయటపడేందుకు ఇప్పుడు ప్రైవేటు బిల్లు అంటూ హడావుడి చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

    విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు..
    మరోవైపు విశాఖలో సీఎం ఆఫీసు ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే రుషికొండ ప్రాంతంలో నిర్మాణ పనులు జరగుతున్నాయి. అందుకే ఎన్ని వివాదాలు వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ నెల రోజుల్లో హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తోంది. కోర్టు ఆదేశాలనైనా అమలు చేయాలి. లేకుంటే హై కోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలి. అందుకే వైసీపీ సర్కారు ఉన్నపలంగా ఇప్పుడు రాజ్యసభలో మూడు రాజధానులకు మద్దతుగా ప్రైవేటు బిల్లులు వేసింది. కానీ ఇప్పటికే బీజేపీ అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేసింది. అయితే రాజధాని ఏర్పాటన్నది మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని.. అందులో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోదని స్పష్టం చేసింది.

    Also Read:Ayodya Ramamandir: అయోధ్య రామమందిరం ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా?

    Tags