https://oktelugu.com/

Varun Tej- Lavanya Tripathi: లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి పై మళ్లీ పుకార్లు.. ఇంతకీ నిజం ఏమిటి ?

Varun Tej- Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లో హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ రీసెంట్ గా బాగా పుకార్లు పుట్టించారు. లావణ్యతో వరుణ్ గత కొన్ని ఏళ్లుగా ఘాటు ప్రేమలో ఉన్నాడని, అందుకే, ఆమె వరుణ్ తో ఏడ‌డుగులు వేయ‌బోతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్రమంలోనే లావ‌ణ్య త్రిపాఠి కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ఒప్పుకోవడం లేదట. లావ‌ణ్య త్రిపాఠి తెలుగు, తమిళ భాషల్లో కొత్త […]

Written By:
  • Shiva
  • , Updated On : August 7, 2022 / 08:38 AM IST
    Follow us on

    Varun Tej- Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లో హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ రీసెంట్ గా బాగా పుకార్లు పుట్టించారు. లావణ్యతో వరుణ్ గత కొన్ని ఏళ్లుగా ఘాటు ప్రేమలో ఉన్నాడని, అందుకే, ఆమె వరుణ్ తో ఏడ‌డుగులు వేయ‌బోతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్రమంలోనే లావ‌ణ్య త్రిపాఠి కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ఒప్పుకోవడం లేదట.

    Varun Tej- Lavanya Tripathi

    లావ‌ణ్య త్రిపాఠి తెలుగు, తమిళ భాషల్లో కొత్త చిత్రాల ఆఫర్లు వస్తున్నా.. అంగీకరించడం లేదు. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్‌ చేస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి పెళ్ళి పీటలెక్కబోతోందని.. అందువల్లే లావణ్య తనకు వస్తున్న ఆఫర్లకు నో చెబుతోందనే ప్రచారం సాగింది.

    Also Read: Senior Heroine Tabu: అడుక్కోవాల్సిన అవసరం లేదు.. సీనియర్ భామ ఘాటు వ్యాఖ్యలు

    ఇక ఇదే అంశంపై లావ‌ణ్య త్రిపాఠి స్పందిస్తూ.. ‘తెలుగు, తమిళ భాషల్లోని ప్రేక్షకుల్లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు, పేరు ఉంది. అందుకే మంచి కథతో కూడిన చిత్రాలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాను. అంతకుమించి మరో కారణం అంటూ ఏదీలేదు’ అని ఆమె తన వివరణ ఇచ్చింది.

     

    ఎంతో సింపుల్ గా కనిపించే లావ‌ణ్య త్రిపాఠి తన సహజసిద్ధమైన నటన, అధ్బుతమైన డాన్స్ స్టెప్పులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి మాత్రం వరుణ్ తేజ్ తో ఏడ‌డుగులు వేయ‌బోతున్న విషయం పై ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు. అటు వరుణ్ తేజ్ కూడా ఈ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేయలేదు.

    Varun Tej- Lavanya Tripathi

    వ‌రుణ్‌ తేజ్, లావ‌ణ్య ఇద్ద‌రూ ‘మిస్ట‌ర్‌’, ‘అంత‌రిక్షం’ వంటి సినిమాల్లో కలిసి న‌టించారు. ఆ సినిమాల స‌మ‌యంలోనే వీరిద్ద‌రూ ల‌వ్‌లో ప‌డ్డార‌ని వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత వ‌రుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లిలోనూ లావ‌ణ్య క‌నిపించింది. ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

    కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే నిహారిక పెళ్లికి వెళ్ళింది. అలాంటిది మరి, లావణ్య ఎలా వెళ్ళింది ? అంటూ అప్పుడే రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మొత్తమ్మీద ఆ పుకార్లకు వీరి ప్రవర్తన మరింత ఊత‌మిచ్చిన‌ట్లైంది.

    Also Read:Payal Rajput: ఆ విషయంలో తగ్గేదే లే అంటున్న పాయల్ రాజ్ పుత్ !.

    Tags