https://oktelugu.com/

AP Politics: ఏపీలో గుంభనంగా రాజకీయ పార్టీలు

వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. తెలుగుదేశం,జనసేన మధ్య పొత్తు కుదిరింది. అయితే ఏపీలో బిజెపి ఎవరితో కలిస్తే అవతల పార్టీతో కాంగ్రెస్ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : December 6, 2023 10:29 am
    AP Politics

    AP Politics

    Follow us on

    AP Politics: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఒక్క రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మిగతా నాలుగు రాష్ట్రాలను బిజెపి కైవసం చేసుకుంది. అయితే ఏపీలో రాజకీయ పక్షాలు ఈ ఫలితాలపై స్పందించడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం పై వైసీపీ, టిడిపి, జనసేన నోరు మెదపకపోవడం విశేషం. ముఖ్యంగా ఏపీలో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్తాయి అన్న దానిపై చర్చ నడుస్తోంది.

    వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. తెలుగుదేశం,జనసేన మధ్య పొత్తు కుదిరింది. అయితే ఏపీలో బిజెపి ఎవరితో కలిస్తే అవతల పార్టీతో కాంగ్రెస్ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో బిజెపి వ్యూహం ఏంటి? ఎవరికి సహకరిస్తుంది? మరెవరిని టార్గెట్ చేస్తుంది? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్నటివరకు బిజెపి కోసం ఆరాటపడిన చంద్రబాబు.. ఇప్పుడు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. పవన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిజెపి వస్తుందని చెబుతున్నారు.

    తొలుత కర్ణాటక గెలిచిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో సైతం బాగా వేసింది. అయితే తన చేతిలో ఉన్న చత్తీస్గడ్, రాజస్థాన్లను మాత్రం కోల్పోయింది. దీంతో బిజెపి, కాంగ్రెస్ లకు ఇవి మిశ్రమ ఫలితాలే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామని బిజెపి నేతలు సంకేతాలు పంపుతున్నారు. కానీ ఏపీ విషయంలో ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే మొన్నటి వరకు ఏపీలో ఏ పార్టీ గెలిచినా తమకు మద్దతుని ఇచ్చే వ్యూహాన్ని బిజెపి అమలు చేసింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి ఎలా ముందుకెళుతుందన్నదానిపై చర్చ నడుస్తోంది.అయితే ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు బిజెపి పై ఆగ్రహంగా ఉన్నాయి. చంద్రబాబును అరెస్టు చేయించి బలహీనపరిచే ప్రయత్నం జరిగిందన్న అనుమానం ఉంది.

    టిడిపి,జనసేన కూటమిలోకి బిజెపి వస్తే ఓటమి తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అదే బిజెపి విడిగా పోటీ చేస్తే టిడిపి, జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బిజెపి విడిగా పోటీ చేసి వైసిపికి లోపాయికారిగా సహకరిస్తుందా? లేకుంటే టీడీపీ, జనసేన కూటమికి సహకరిస్తుందా అన్నది చూడాలి. అయితే బిజెపి పాత్ర బట్టి.. ఏపీలో కాంగ్రెస్ వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. మరి బిజెపి ఎలా ముందుకెళ్తుందో? కాంగ్రెస్ ఎటువైపుకు వెళ్తుందో? చూడాలి.