Mega Family: ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం రాష్ర్టంలో చర్చనీయాంశం అవుతోంది. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలతో రాజకీయ దుమారం రేగుతోంది. పవన్ కళ్యాణ్ టికెట్ల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అల్లు అరవింద్ మాత్రం జగన్ ను పరిశ్రమను కాపాడాలని వేడుకుంటున్నారు. దీంతో నిర్మాతల పక్షాన అరవింద్ నటుల కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు మెగా కుటుంబానికే నష్టం కలిగించేవిగా ఉన్నాయి. దీంతో అరవింద్ జగన్ తో ప్రాధేయపడుతున్నారని తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పెద్ద సినిమాలకే నష్టం కలిగే సూచనలున్నాయి. దీంతో పెద్ద హీరోలకే ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలే నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఉండవు. టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరమున్నా అదనపు షోలు కూడా వేయాల్సి ఉంటుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశంతో సినిమా పరిశ్రమపై వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం రగిలింది. దీంతో వైసీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య పెద్ద అగాధం నెలకొంది. సినిమా టికెట్ల విషయంలో నాలుగు షోలకు అనుమతులు ఇవ్వడంపైనే మనుగడ ఆధారపడి ఉంది. సినిమా హక్కులపై అరవింద్ లాంటి వారు బతిమాలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ కాళ్ల బేరానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
గతంలో నంది అవార్డుల వివాదంలో కూడా పరిశ్రమ పలు సమస్యలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలో రెండు పార్టీలు విమర్శలకు దిగుతున్నాయి. జనసేన వర్సెస్ వైసీపీ పార్టీల్లో నాయకులు తమ నోళ్లకు పనిచెబుతున్నారు. దీంతో పెద్ద హీరోల సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో నిర్మాతలు సైతం భయపడుతున్నారు. టికెట్ల వ్యవహారంలో ప్రభుత్వం చూసీచూడనట్లు పోవాలని అభ్యర్థిస్తున్నారు.