
వైసీపీ సోషల్ మీడియా సైన్యాన్ని మళ్లీ ఫాంలోకి తెచ్చేందుకు పార్టీ నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఇటీవలి కాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కోర్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ విచారణ కూడా ప్రారంభం కావడంతో దూకుడు తగ్గించారు. పోస్టులు కూడా ఆచీతూచీగా పెడుతున్నారు.
Also Read: హుందాతనం కోల్పోతున్న ఏపీ అసెంబ్లీ.. నేతల తీరే కారణమా?
సోషల్ మీడియా కీలకం
వైసీపీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా కార్యకర్తలు కీలకంగా పనిచేశారు. ప్రత్యర్థులను ప్రచారాలను తిప్పికొట్టడమే కాకుండా పార్టీ పథకాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. అందుకు వారికి ఇబ్బంది రాకుండా చూడాలని భావించిన సీఎం జగన్ భరోసా ఇచ్చే బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పజెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన ఆయన తాడేపల్లిలో అన్ని రాష్ట్రాల సోషల్ మీడియా సపోర్టర్స్‌ను పిలిచి రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని భరోసా ఇస్తున్నారు. ఎనిమిది నుంచి పదివేల మంది వరకూ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారని.. అందరికీ ఇచ్చిన హమీలు నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు.
Also Read: కేంద్రం వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత ఎందుకు?
Also Read: కోర్టు ధిక్కారణ కేసులు పెడితే..
కోర్టులు, జస్టిస్‌లపై వైసీపీ కార్యకర్తలు తిట్లు, శాపనార్థాలతో పోస్టులు పెట్టారు. దీనిపై ఇప్పటికే సీబీఐ ఎంక్వైరీ నడుస్తోంది. ఇలాంటి సమయంలో.. కోర్టుధిక్కరణ వంటి కేసులు పెడితే వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే విజయసాయిరెడ్డి సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లీగల్‌గా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటామని హామీ ఇస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Comments are closed.