https://oktelugu.com/

YCP MLC arrested : తిరుమలలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముకుంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అరెస్టు

YCP MLC arrested : ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని పకడ్బందీగా ఉన్నా, అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. శ్రీవారి దర్శన టిక్కెట్లకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బాగా డిమాండ్ పెరిగింది. సాధారణ దర్శన టోకెన్లు దొరకడం కూడా కష్టతరంగా మారిన నేపథ్యంలో, బ్లాక్ టిక్కెట్ల విక్రయాలు బాగా పెరిగాయి. సాధారణ భక్తులకు అందుబాటులో ఉండని దర్శన టిక్కెట్లు, అక్రమార్కుల దగ్గర ఇబ్బడిముబ్బడిగా దొరుకుతుండటం విస్మయానికి గురిచేస్తుంది. తాజాగా ఇదే వ్యవహారంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : April 21, 2023 9:15 pm
    Follow us on

    YCP MLC arrested : ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని పకడ్బందీగా ఉన్నా, అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. శ్రీవారి దర్శన టిక్కెట్లకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బాగా డిమాండ్ పెరిగింది. సాధారణ దర్శన టోకెన్లు దొరకడం కూడా కష్టతరంగా మారిన నేపథ్యంలో, బ్లాక్ టిక్కెట్ల విక్రయాలు బాగా పెరిగాయి. సాధారణ భక్తులకు అందుబాటులో ఉండని దర్శన టిక్కెట్లు, అక్రమార్కుల దగ్గర ఇబ్బడిముబ్బడిగా దొరుకుతుండటం విస్మయానికి గురిచేస్తుంది. తాజాగా ఇదే వ్యవహారంలో ఓ వైసీపీ ఎమ్మెల్సీ అరెస్టు కావడం సంచలనంగా మారింది.

    వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలలో అక్రమాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయనే ప్రచారం ఎక్కువగా ఉంది. సాధారణ టిక్కెట్ల కంటే బ్రేక్ దర్శన టిక్కెట్లకు ఉన్న డిమాండే వేరు. వాటి కోసం ఎంతోమంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సిఫార్సు లేఖలను పొందుతుంటారు. ఆ లేఖలు ఉంటే రూం కూడా దొరకడం ఈజీ. అంతేగాక, దర్శనం కూడా బాగా జరుగుతుంది. వీఐపీ భక్తుల కోసం ఓ ప్రత్యేక సమయాన్ని టీటీడీ కేటాయించి ఉంటుంది. ఇదే అదునుగా కొంతమంది అధికార పార్టీ నాయకులు వ్యాపారంగా మార్చుకొని సిఫార్సు లేఖలను అందజేస్తుండటం విచారించదగ్గ విషయం.

    టీటీడీ టిక్కెట్ల కుంభకోణానికి వైసీపీ ఎమ్మెల్సీ షేక్ షార్జాశ్రీ ఉన్నట్లు తిరుమల దేవస్థానం అధికారులు తేల్చారు. ఆయన తిరుమల దర్శనానికి తరుచూ వస్తున్నారు. వెంట 10 నుంచి 20 మందిని తీసుకువచ్చుకుంటున్నారు. వారందరికీ ప్రోటోకాల్ దర్శనం చేయించుకుంటున్నారు. ఈ సారి ఎందుకో తిరుమల అధికారులకు డౌటు వచ్చింది. ఎమ్మెల్సీ వెంట వచ్చిన వారందరీ ఐడెంటిటీ కార్డులను తనిఖీ చేశారు. వారందరివి తప్పుడు ఆధార్ కార్డులని తేలింది. ఒక్కొక్కరి వద్ద రూ.10 వేలు తీసుకొని దర్శనానికి తీసుకువస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. సదరు ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాలో లక్ష రూపాయలకు మించి జమయినట్లు తెలిసింది. దాంతో వెంటనే ఆ పది మందితో పాటు ఎమ్మెల్సీ షేక్ షార్జాశ్రీని కూడా టీటీడీ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

    తిరుమలకు ఇలా మందిని వెంటేసుకురావడం అధికార పార్టీ నాయకులకు షరా మామూలుగా మారింది. ఆ మధ్య మంత్రి రోజా ఓ 30 నుంచి 40 మందితో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద దూమారమే రేపింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల గౌరవ మర్యాదలపైనా వివాదాలు నెలకొన్నాయి. మద్యం, గంజాయి కూడా దొరుకుతుండటంపై భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పద్దతులు మార్చుకుంటారా? లేక అధికార పార్టీ కదా అని చూసీచూడనట్లు వ్యవహిరస్తారా అనేది వేచి చూడాల్సిందే.