https://oktelugu.com/

ఎమ్మెల్యే రోజా రంగంలోకి.. ఇక దబిడదిబిడే!

తెలంగాణ మంత్రులకు కౌంటర్ ఇవ్వడానికి ఏపీ మంత్రుల బలం సరిపోలేదు. అందుకే ఏకంగా ఫైర్ బ్రాండ్ రంగంలోకి దిగారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా మాటల తూటాలు పేల్చుతూ తెలంగాణ మంత్రులను కడిగేశారు. మరోసారి జగన్, వైఎస్ఆర్ లను తిడితే ఊరుకునే ది లేదని హెచ్చరికలు జారీ చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ లపై నోరుపారేసుకుంటున్న తెలంగాణ మంత్రులకు ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చరికలు జారీ చేశారు.వైఎస్ఆర్, జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 2, 2021 5:23 pm
    Follow us on

    RK Roja

    తెలంగాణ మంత్రులకు కౌంటర్ ఇవ్వడానికి ఏపీ మంత్రుల బలం సరిపోలేదు. అందుకే ఏకంగా ఫైర్ బ్రాండ్ రంగంలోకి దిగారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా మాటల తూటాలు పేల్చుతూ తెలంగాణ మంత్రులను కడిగేశారు. మరోసారి జగన్, వైఎస్ఆర్ లను తిడితే ఊరుకునే ది లేదని హెచ్చరికలు జారీ చేశారు.

    దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ లపై నోరుపారేసుకుంటున్న తెలంగాణ మంత్రులకు ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చరికలు జారీ చేశారు.వైఎస్ఆర్, జగన్ లను ‘నీటి దొంగలు’ మోసగాళ్లు అని విమర్శిస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కృష్ణా, గోదావరి జలాల్లో వైఎస్ఆర్ ఎప్పుడూ తెలంగాణ నీటిని దోచుకోలేదని.. 2004-2009 వరకు జలయజ్ఞం చేపట్టి ఎన్నో ప్రాజెక్టులు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేశారని రోజా గుర్తు చేశారు.

    వైఎస్ఆర్ చేపట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కూడా కృష్ణా నీటిలో ఏపీ వాటాను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికేనని అన్నారు. నీటి పారుదల రంగంలో ఏబీసీడీలు కూడా తెలియని తెలంగాణ మంత్రులు నోరు పారేసుకుంటున్నారని.. చెడ్డ మాటలు మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు.

    ఏపీ మంత్రులు, సీఎం ఎంత సంయమనంతో ఉన్నా ఇలా నోరు పారేసుకుంటున్నారని.. ఇక సహించేది లేదని రోజా తొడగొట్టేశారు. మేము వారికి తగిన గుణపాఠం నేర్పుతామని రోజా హెచ్చరించారు.

    కృష్ణా, సాగర్ లలో విద్యుదుత్పత్తికి నీటిని వృథా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తోందని రోజా విమర్శించారు. ఏపీ తాగు, సాగునీటికి లేకుండా తెలంగాణ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టివేస్తోందని విమర్శించారు.

    ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఏపీ సీఎం జగన్ మౌనం వహిస్తున్నారని.. ప్రతిదానికి ఒక పరిమితి ఉందని రోజా విమర్శించారు. తెలంగాణ మంత్రులు తమ పరిధులు దాటవద్దని విమర్శించారు.