కొన్నాళ్ల క్రితం ఆయన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. అప్పట్లో అది తన వాయిస్ కాదని బుకాయించలేదు. ఇప్పుడు కూడా ఆయనపై వస్తున్న పుకార్లను ఖండించడం లేదు. దీంతో వీటిపై ఆయనకు సంబంధం ఉందని పలువురు నమ్ముతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు.
ఒక వేళ అవి నిజం కానట్లయితే పత్రికా ముఖంగా ఖండించి తన తప్పు లేదని చెప్పేందుకు ఆయన ముందుకు రావడం లేదు. దీంతో ఆయన పాత్రపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం లేదు. రానున్న రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న 90 శాతం మంది మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.
దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న సదరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేసే కుట్రలో ఒక భాగమే ఈ ఆడియోలని కొట్టిపారేయడానికి వీలు లేదు. ఈ క్రమంలో ఆయనను పోటీ నుంచి తప్పించడానికే ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మరో టాక్ వస్తోంది. ఏది ఏమైనా ఇంటా బయట ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
వైసీపీలో ఇలాంటి చిత్రమైన రీతిలో ఆరోపణలు రావడంతో పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బ తింటోందనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు ప్రతి సారి ఇదే రీతిలో ఆడియోలు బయటకు రావడంతో ఆయన మనుగడపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధినేత జగన్ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.