https://oktelugu.com/

ఆనందయ్య మందు ఇక ఉచితం కాదు..

కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. మనుషుల ప్రాణాలను పణంగా కరోనా వైరస్ విజృంభించింది. దీంతో లక్షలాది మంది తమ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశమే కాకుండా ప్రపంచమే భయాందోళనకు గురైంది. మొదటి, రెండో దశలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ప్రస్తుతం మూడో ముప్పు పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ గురించి అందరు గుబులు చెందుతున్నారు. థర్డ్ వేవ్ పై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : August 9, 2021 / 06:40 PM IST
    Follow us on

    కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. మనుషుల ప్రాణాలను పణంగా కరోనా వైరస్ విజృంభించింది. దీంతో లక్షలాది మంది తమ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశమే కాకుండా ప్రపంచమే భయాందోళనకు గురైంది. మొదటి, రెండో దశలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ప్రస్తుతం మూడో ముప్పు పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ గురించి అందరు గుబులు చెందుతున్నారు. థర్డ్ వేవ్ పై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

    అయితే కరోనా వైరస్ ను రూపుమాపే మందును మన తెలుగు వాడైన ఆనందయ్య కనిపెట్టడంతో ఆయన ఇచ్చే మందుకు అప్పట్లో అంత ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన ఇచ్చిన మందు తీసుకున్న వారికి కరోనా తగ్గిందని పరిశోధనలు సైతం రుజువు చేశాయి. దీంతో ఆనందయ్య మందుపై కోర్టులు సైతం జోక్యం చేసుకుని ఆయన ఇచ్చే మందు మంచిదేనని తేల్చాయి. దీంతో వైసీపీ నాయకులు ఆయనను నిర్బంధించి మందు పంపిణీకి అంతరాయం సృష్టించారు. దీంతో ఆయన తన ఆశయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులను తొలగించుకుని మందు ఉచితంగా పంపిణీ చేయాలని భావించినా వీలు కావడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం తనను నిర్బంధించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. కోర్టు అనుమతి తీసుకున్నాక మందు పంపిణీ ప్రారంభించానని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం తనకు సహకరించడం లేదని వివరించారు. అందుకే తాను మందు విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

    అయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మందు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నా అది నెరవేరడం లేదు. ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నందున మందు పంపిణీ ఉచితంగా చేయలేకపోతున్నానని వాపోయారు. ప్రభుత్వ సహకారం ఉంటే మందు పంపిణీ ఉచితంగా సాధ్యమయ్యేదని చెప్పారు. ఎవరి సాయం అందకపోవడంతోనే మందు పంపిణీపై ఈ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని ఆనందయ్య ఎదురుచూస్తున్నారు.