Prashant Kishor- YCP: ఏపీలో వైసీపీకి అంతులేని విజయాన్ని సాధించిపెట్టారు ప్రశాంత్ కిశోర్. వ్యూహకర్తగా వైసీపీని అధికారంలోకి తేవడానికి ఎంతో దోహదపడ్డారు. ఇప్పటికీ తన ఐప్యాక్ టీమ్ ద్వారా పార్టీకి సేవలందిస్తున్నారు. అయితే ఆయన ఇటీవల చేసిన పొత్తుల ప్రకటన, ప్రతిపాదనలు ప్రకపంనలు రేపుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తు అవసరమని.. ఏపీలో వైఎస్సార్ సీపీతో పొత్తు ఉభయ పార్టీలకు ఉభయతారకంగా ఉంటుందని పీకే కాంగ్రెస్ అధిష్టానానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. రాజకీయవర్గాల్లో కూడా ఆసక్తిని రేపాయి. రాజకీయంగా బలంగా ఉన్న జగన్ కాంగ్రెస్ తో కలుస్తారా? రాజకీయంగా సమాధి చేసిన జగన్ తో కలవడానికి కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపుతుందా? అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. బలం, బలహీనత అన్న మాట కాకుండా అవసరమే ఇప్పుడు ఆ రెండు పార్టీలను కలుపుతుందన్న వాదనా వినిపిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వరుసగా అంతులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. విపక్ష నేతలను దారికి తెచ్చుకునేందుకు కేసులను బూచీగా చూపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది.
ఈ పరిస్థితుల్లో జగన్ బీజేపీకి ఎదురెళ్లి కాంగ్రెస్ లో కలవరన్న టాక్ నడుస్తోంది. బీజేపీ గ్రాఫ్ తగ్గి కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగే పక్షంలో ఆయన పునరాలోచించక తప్పదు. తన కేసుల నుంచి బయటపడేయ్యడానికి బీజేపీ పెద్దల సహకారం కొరవడితే మాత్రం జగన్ కు ఉన్న ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: ABN RK KomatiReddy: కేసీఆర్ లక్ష కోట్ల స్కాంకు ఆధారాలున్నాయి.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేస్తుండడం, సీనియర్ నేతలంతా ఏకతాటిపైకి రావడం జాతీయ కాంగ్రెస్ పార్టీకి శుభ సూచికం. కాంగ్రెస్ రూటు మార్చి ప్రజల్లోకి వస్తే మాత్రం పునరుజ్జీవం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వేరుపడి ఆవిర్భవించిన పార్టీలు, కాంగ్రెస్ భావజాలం కలిగిన పార్టీలు, బీజేపీయేతర శక్తులను ఏకం చేసే పనిలో పీకే ఉన్నారు. అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ వద్ద వైసీపీ పొత్తు ప్రస్తావన తెచ్చారు. అదే సమయంలో తనకు ఎంతో చనువు ఉన్న జగన్ కు మాట మాత్రమైనా చెప్పకుండా పొత్తు అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో తేరని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అధికార పార్టీలో కాక..
కాంగ్రెస్ తో పొత్తు వ్యవహారం వైసీపీలో కాక రేపుతోంది. వాస్తవం తెలియక నేతలు విభిన్న ప్రకటనలు చేస్తూ కాక రేపుతున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేసే పార్టీలకే ప్రాధాన్యముంటుందని.. అటువంటి పార్టీలతో కలిసి వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. అంటే బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరించకుంటే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉందని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో పొత్తుల విషయంలో మా పార్టీ అధినేత జగన్ దే తుది నిర్ణయమని ప్రకటించారు.
మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడారు. కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడానికే జగన్ వైసీపీ స్థాపించిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి పార్టీతో మేము ఎలా కలుస్తామని ప్రశ్నించారు. వ్యూహాలు రచించే వరకూ ప్రశాంత్ కిశోర్ పని అని.. ఆయన చెప్పినవే చేయాలన్న రూల్ ఎక్కడా లేదన్నారు. 135 సంవత్సరాల పార్టీని కుక్కటివేళ్లతో పెకిలించారని.. కనీసం పోటీచేయడానికి అభ్యర్థులు లేకుండా తమ అధినేత జగన్ చేశారని వ్యాఖ్యానించారు. అయితే ఈ పొత్తుల విషయంలో అధినేత రాజకీయం తెలియక నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. పొత్తులు అధినేత ఇష్టమంటూనే తమకు నచ్చిన రీతిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. చివరకు ఈ పొత్తుల నావ ఏ తీరానికి చేరుతుందో చూడాలి మరీ.
Also Read:KTR- BJP- Congress: రివర్స్ పంచ్: కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ కౌంటర్ అటాక్!
Recommended Videos