Minister Viswarup: రాష్ర్టంలో అమలాపురం అల్లర్లు సంచలనం సృష్టించాయి. మరోవైపు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ వ్యవహారం వైసీపీ మెడకు చుట్టుకుంది. దీంతో రెండు దురంతాలు పార్టీని పాతాళానికి తోస్తున్నాయి. వైసీపీ పరువు గంగలో కలిసిపోతోంది. దీంతో అమలాపురం గొడవల వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ప్రజలను అంతర్మథనంలోకి నెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలా దాడులు చేయిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ ప్రతిష్ట గురించి డైవర్ట్ చేసే క్రమంలో పన్నాగాలు పన్నుతోంది.

అమలాపురం అల్లర్ల వెనుక ఓ కౌన్సిలర్ హస్తం ఉందని మంత్రి విశ్వరూప్ ప్రకటించడం తెలిసిందే. తన ఎదుగుదలకు అడ్డంకులు సృష్టించేందుకే సొంత పార్టీ నేతలు పూనుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎంతటి వారైనా ఒదిలిపెట్టే ప్రసక్తే లేదు. విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. వైసీపీ నేతలే ఇలా అసమ్మతిగా మారి విధ్వంసం సృష్టించడంపై మండిపడుతున్నారు. త్వరలోనే దీనికి చరమగీతం పాడతామన్నారు.
Also Read: Koratala Siva: ప్చ్.. ‘కొరటాల’ కు మళ్లీ లాంగ్ గ్యాప్ తప్పేలా లేదు !
రాజకీయ దురుద్దేశంతోనే కావాలనే ఇలా చేయడం తగదని హితవు పలుకుతున్నారు. వైసీపీలో ఉంటూ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేయడం సరైంది కాదని తెలిసినా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దాడులకు పాల్పడింది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఎవరిని వదిలిపెట్టం. అందరిపై చర్యలు తీసుకుంటాం. ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలను ఎవరు కూడా సహించరు. దీనికి కచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడతాం.

పార్టీలో రౌటీషీటర్లు ప్రవేశించి పార్టీని అధోగతి పాలు చేస్తున్నారు. దీనిపై అధిష్టానమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కానీ వారే ఇలాంటి వారిని ప్రోత్సహించి పార్టీలోకి తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ భవితవ్యం డైలమాలో పడే అవకాశం ఉంది. దీనికి పార్టీయే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనిపై మంత్రి విశ్వరూప్ సొంత పార్టీ అయినా ఏమైనా బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు.
Also Read:Konaseema Violence: కోనసీమ కల్లోలం: వైసీపీ, టీడీపీలో ఎవరిది నెపం?
Also Read:


