Illegal Affair: అందిన దాన్ని కాదని అందని దాని కోసం చాలా మంది అర్రులు చాస్తుంటారు. ఉన్న దానితో తృప్తి పడకుండా ఇంకేదో కావాలని వెంపర్లాడతారు. దీంతోనే చిక్కుల్లో పడతారు. తామేదో సాధించామని ప్రొఫెషనల్స్ గా భావించి హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే కటకటాల పాలవుతున్నారు. అయినా ఎందుకో మార్పు రావడం లేదు. తమ పంతం నెరవేర్చుకునే క్రమంలో ఎలాంటి దురాగాతాలకైనా వెనుకాడటం లేదు. నమ్మిన వారి గొంతు కోసి తప్పించుకోవాలని చూస్తున్నా కుదరడం లేదు. దీంతోనే పోలీసులకు దొరికిపోయి జైలు జీవితం గడుపుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలోని నాగ్లే లో ఉపేంద్ర సింగ్ అనే యువకుడు ఉంటున్నాడు. అతడికి గత డిసెంబర్ లో ప్రీతి(25) అనే యువతితో వివాహం జరిగింది. తరువాత బంధువులు అందరు సంతోషంగా ఉంటున్నారని సంబరపడిపోయారు. కానీ ఉపేంద్ర మాత్రం సంతోషంగా ఉంటున్నట్లు నటించాడు. ఈ క్రమంలో ప్రీతి హత్యకు పథకం వేశాడు. ఎలాగైనా భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉపేంద్ర కు ఇంతకు ముందే మోనిక అనే యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. దీంతో పెళ్లి తరువాత కూడా వారి ప్రేమ కొనసాగింది. అయితే ఉపేంద్ర మోనికను పెళ్లి చేసుకోవాలని భావించినా అతడి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ప్రీతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
Also Read: Pooja Hegde: ఆ విషయంలో ఎందుకు సిగ్గు ? ఏమైనా చేయాలి ?

ఉపేంద్ర సింగ్, ప్రీతి రాత్రి భోజనం చేశాక నిద్రపోయారు. అర్థరాత్రి దాటాక ఉపేంద్ర తన ప్రియురాలు మోనిక, ఆమె స్నేహితురాలు పల్లవిని ఇంటికి పిలిపించుకున్నాడు. తరువాత పథకం అమలు చేశాడు. మోనిక, పల్లవి ప్రీతి కాళ్లు చేతులు పట్టుకుంటే ఉపేంద్ర గుడ్డతో ప్రీతి గొంతు బిగించి దిండుతో అదిమిపెట్టి చనిపోయేందుకు కారకులయ్యారు. తరువాత తన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని అందరిని నమ్మించాడు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి అతడిని అరెస్టు చేయడంతో కథ మొత్తం తెలిసింది.
తన ప్రియురాలు కోసం తానే భార్య ప్రీతిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో ప్రియురాలు మోనిక, ఆమె స్నేహితురాలు పల్లవి ముగ్గురు కటకటాలపాలయ్యారు. తమ సుఖానికి అడ్డు వస్తుందనే ఉద్దేశంతో ప్రీతిని అంతం చేయడం చర్చనీయాంశంగా మారింది. అత్యాశకు పోతే ఇలాగే ఉంటుందని తెలిసినా మనుషుల్లో కర్కశత్వం పోవడం లేదు. కట్టుకున్న భార్యనే కడతేర్చేందుకు భర్త ఆడిన నాటకం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read:F3 Movie Business: ఇంతకీ ‘ఎఫ్ 3’ బిజినెస్ సంగతి ఏమిటి ?
Recommended Videos:


