YCP: భీమిలి సీటు అవంతికే.. అనూహ్యంగా తెరపైకి గంటా

భీమిలిలో ప్రస్తుతం అవంతి శ్రీనివాసరావు ఎదురీదు తున్నారు.ఇక్కడ ఆయన వ్యతిరేకవర్గం స్ట్రాంగ్ గా ఉంది.వచ్చే ఎన్నికల్లో అవంతికి సీటు ఇస్తే తాము పనిచేయమని కూడా హెచ్చరించింది.2009లో ప్రజారాజ్యం, 2019లో వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గా గెలిచారు.

Written By: Dharma, Updated On : August 25, 2023 6:20 pm

YCP

Follow us on

YCP: వైసిపి దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. టికెట్ల కోసం పోటీలేని చోట అభ్యర్థులు వీరేనంటూ సంకేతాలిస్తోంది. తాజాగా విశాఖ జిల్లాలో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రాంతీయ సమన్వయకర్త వై వి సుబ్బారెడ్డి ప్రకటిస్తున్నారు. పనిచేసుకోవాలని నేతలకు సూచిస్తున్నారు. అందులో భాగంగా భీమిలి టిక్కెట్ ని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకి ఖరారు చేశారు. భీమిలి సమన్వయ కమిటీ సమావేశంలో ప్రకటించారు. గతం కంటే ఎక్కువ మెజారిటీ తో అవంతిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అయితే భీమిలిలో ప్రస్తుతం అవంతి శ్రీనివాసరావు ఎదురీదు తున్నారు.ఇక్కడ ఆయన వ్యతిరేకవర్గం స్ట్రాంగ్ గా ఉంది.వచ్చే ఎన్నికల్లో అవంతికి సీటు ఇస్తే తాము పనిచేయమని కూడా హెచ్చరించింది.2009లో ప్రజారాజ్యం, 2019లో వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గా గెలిచారు. అయితే ఆయన ఆశించిన స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని మూడు మండలాల పార్టీ శ్రేణులు ఆయన్ను బాహటంగానే వ్యతిరేకిస్తున్నాయి. అయినా హై కమాండ్ అవంతినే ఖరారు చేయడంపై వైసీపీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కొందరైతే పార్టీ నిర్ణయాన్ని బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయం వైపు మొగ్గు చూపుతున్నారు.

అయితే భీమిలి వైసీపీలో ఉన్న ప్రతికూల పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీకి సిద్ధపడుతున్నట్లు Alcohol. 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు మంత్రిగా కూడా పదవి చేపట్టారు. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మార్చడం రివాజుగా మారింది. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన.. ఈసారి నియోజకవర్గాన్ని మార్చుతారని టాక్ నడుస్తోంది. ఒకవేళ గంటా కానీ భీమిలి నుంచి పోటీ చేస్తే వైసీపీలో అవంతిని వ్యతిరేకిస్తున్న వర్గాలు టిడిపి గూటికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వాస్తవానికి అవంతి శ్రీనివాసరావుకు ప్రత్యామ్నాయంగా వీఆర్డిఏ చైర్ పర్సన్ అక్కరామని విజయనిర్మలను హై కమాండ్ గుర్తించింది. విజయనిర్మల భీమిలి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టేవారు. యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. ఆమెను పోటీచేస్తే బీసీ వర్గాలకు ప్రోత్సహించినట్లు అవుతుందని నాయకత్వం భావించింది. కానీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికం. అందుకే అనివార్య పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అవంతినే అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. వైసీపీలో ఉన్న ఈ పరిస్థితులను పరిశీలించిన టిడిపి హై కమాండ్ గంటాను బరిలో దింపుతున్నట్లు సమాచారం.