Kuppam: కంచే చేను మేస్తే ఎలా? అడ్డుకోవాల్సిన ప్రభుత్వమే నేరాలకు పాల్పడితే ఇక ఆపేదెవరు? గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు పడ్డాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇటీవల జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలోనూ దొంగ ఓట్ల హవా కొనసాగిందని తెలుస్తోంది. తాజాగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ దొంగ ఓట్లు వేయడానికి వేలాది మందిని వైసీపీ తరలిస్తోందని టీడీపీ నేతలు వాపోతున్నారు.

కుప్పంలో టీడీపీ గెలవకుండా చేయాలని వైసీపీ భావిస్తోంది. దీని కోసం పెద్దిరెడ్డిని ఇన్ చార్జిగా నియమించారు. బద్వేల్ లో ఉపయోగించిన పథకాన్ని ఇక్కడ కూడా ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని పాఠశాలల్లో స్థానికేతరులను భారీగా మోహరించింది. వీరితో దొంగ ఓట్లు వేయించాలని చూస్తోంది. కొన్ని చోట్ల టీడీపీ నేతలే వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Also Read: కుప్పంలో ఘర్షణ.. రణరంగం.. మాజీ మంత్రి అరెస్ట్
ఉదయం నుంచే పోలింగ్ బూత్ ల వద్ద టీడీపీ నేతలే స్వయంగా దొంగ ఓటర్లను గుర్తిస్తున్నారు. కనీసం గుర్తింపు కార్డులు సైతం వారి దగ్గర లేకపోవడం గమనార్హం. దీంతో అధికార పార్టీ ఆగడాలపై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. తమిళనాడు నుంచి వస్తున్న ఓ దొంగ ఓటర్ల బస్సును టీడీపీ నేతలు అడ్డగించి అద్దాలు పగుటగొట్టారు.
Also Read: కుప్పంలో వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ రెడీయేనా?
వైసీపీ నేతల తీరుతో కుప్పంలో వివాదాస్పదమవుతోంది. ఎన్నికల సంఘం మాత్రం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ఆగడాలను ఆపే ప్రయత్నాలు చేయడం లేదు. రాష్ర్టంలో పాలన ఉందా? లేదా? అనే అనుమానాలు వస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో వైసీపీ టీడీపీ నేతల మధ్య హోరాహోరీగా గొడవలు జరుగుతున్నాయి.