YCP- Celebrities: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని నమ్ముకున్న వారికి నష్టాలే మిగులుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పై నమ్మకంతో పలువురు తమ భవిష్యత్ కోసం పార్టీలో చేరినా అందరికి న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో పార్టీని నమ్ముకున్న వారికి లాభం జరగకపోగా ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇదిగో పదవి అదిగో పదవి అంటూ ఊరిస్తున్నా వారికి ఎందులో కూడా చోటు మాత్రం దక్కడం లేదు. ఫలితంగా వారి ఆశలే అడియాశలవుతున్నాయి. సినిమా వాళ్లయితే మరీ ఎక్కువగా పార్టీపై ఆధారపడినా వారికి ఏ రకమైన ప్రయోజనం మాత్రం దరిచేరకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సినిమా నటుల్లో పోసాని కృష్ణమురళి, ఆలీ, పృధ్వీ తదితరులు వైసీపీ కోసం తీవ్రంగా శ్రమించారు కానీ వారికి నిరాశే ఎదురైంది. ఆలీకి రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం సాగినా అది కుదరలేదు. కానీ ప్రస్తుతం అసెంబ్లీ సీటు ఇస్తారనే వాదన వచ్చినా అది కూడా కుదరకపోవచ్చని తెలుస్తోంది. పృధ్వీ అయితే అటు రాజకీయాలకు ఇటు సినిమాలకు దూరమై నిరుద్యోగిగా మారాడు. దీంతో ఆయన భవితవ్యం గందరగోళంలో పడింది. ఏదో ప్రభుత్వ పదవి వచ్చినా అది కూడా రాజకీయాల ప్రభావంతో అందకుండా పోతోంది.
Also Read: Anasuya Bharadwaj: అనసూయ పోజులపై నెటిజన్ల నెగెటివ్ కామెంట్లు వైరల్
ఇక మోహన్ బాబు అయితే టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని ఆశించారు. ఆయనకు కూడా మొండిచేయి చూపించారు. ఇక పోసాని కృష్ణమురళి పవన్ కల్యాణ్ కౌంటర్లకు బదులిచ్చి ఆయన అభిమానుల చేత దాడికి గురైన సంగతి తెలిసిందే. ఆయనకు కూడా ఏ రకమైన పదవి వరించలేదు. దీంతో సినిమా వాళ్లకు మాత్రం జగన్ చుక్కలే చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో సినిమా ప్రపంచంతో జగన్ కు పనిలేదని ప్రచారం సాగుతోంది.

దీంతో సినిమా వాళ్ల సేవలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ తరువాత వారిని పక్కన పెట్టేసింది. వారికి ఏ రకమైన ప్రయోజనాలు కల్పించకుండా పోవడంతో వారు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బతుకు కోసం ఏదో ఒక పని దొరుకుతుందని ఆశించిన వారికి భంగపాటు కలుగుతోంది. సినీ పరిశ్రమను నిర్లక్ష్యంగా చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వారి బతుకులో వెలుగు లేకుండా పోతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేయడానికి సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. వైసీపీ తీరుతో నటుల్లో ఆందోళన నెలకొంది. తమను ఇంత దారుణంగా చూస్తారా అని మండిపడుతున్నారు.
Also Read:Rana Last Movie: ఇదే నా చివరి సినిమా – రానా దగ్గుపాటి