YCP : వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై

ఇటీవల ఓ సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ప్రకటనతో ఎంపీ అనురాధ నొచ్చుకున్నారు. తనను జగన్ అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అందుకు తగ్గట్టుగానే ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. అప్పటినుంచి ఆమె వైసిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.

Written By: NARESH, Updated On : March 21, 2024 9:52 pm

YCP Candidates

Follow us on

YCP : ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న కొలది నేతలు పార్టీలు మారుతున్నారు.భవిష్యత్తును వెతుక్కుంటూ ఇతర పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై చెప్పనున్నారు. గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఆ పార్టీని వీడనున్నారు. బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆమె భర్త బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. పి.గన్నవరం టికెట్ హామీ లభించడంతో బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

జగన్ ఎంపీ అనురాధకు షాక్ ఇచ్చారు.ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆమె స్థానంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా మంత్రి విశ్వరూప్ తో ఆమెకు విభేదాలు ఉన్నాయి. పంచాయితీలు కూడా నడిచాయి. అయినా సరే పెద్దగా ఊరట లభించలేదు. ఆమెను తొక్కే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇటీవల ఓ సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ప్రకటనతో ఎంపీ అనురాధ నొచ్చుకున్నారు. తనను జగన్ అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అందుకు తగ్గట్టుగానే ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. అప్పటినుంచి ఆమె వైసిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.

పొత్తులో భాగంగా బిజెపికి పది అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అటు బిజెపి హై కమాండ్ సైతం గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా అమలాపురం ఎంపీ అనురాధకు పిలుపు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె భర్త బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా పి.గన్నవరం అసెంబ్లీ సీటు బిజెపికి దక్కితే అక్కడ నుంచి పోటీ చేయాలని అనురాధ భావిస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఆ స్థానం టిడిపి పరిధిలో ఉంది. మహాసేన రాజేష్ కు చంద్రబాబు ఆ స్థానాన్ని కేటాయించారు. దీనిపై టిడిపి జనసేన శ్రేణుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అక్కడ మహాసేన రాజేష్ మార్పు అనివార్యంగా తెలుస్తోంది. అదే జరిగితే అక్కడ నుంచి బిజెపి అభ్యర్థి బరిలో దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ అనురాధ భర్త పురందేశ్వరి ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ వైసీపీని వీడడం ఖాయంగా తేలుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.