YCP vs KTR: ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపాయి. దీంతో కేటీఆర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయినా దాని ఫలితాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. నిన్న హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్ని చెరువులను తలపించడంతో వైసీపీ నేతలు కూడా దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై వర్షం ఫొటోలు ట్రోల్ చేస్తూ ఇదేంటని ప్రశ్నిస్తున్నారు.

ఒకరిని నిందించే ముందు మనమేంటో కూడా చూసుకోవాలి. మన పరిస్థితి ఏంటనే దానిపై కూడా కొంచెం దృష్టి పెట్టాలి. ఒక్క వర్షానికి హైదరాబాద్ రోడ్లన్ని జలమయం అయితే ఏపీ గురించి ఎందుకు నిందలు వేశారంటూ అడుగుతున్నారు. దీంతో కేటీఆర్ నోట్లో పచ్చిమెరపకాయ పడినట్లు అయింది. మా ఫ్రెండ్ ఆంధ్రకు వెళ్లొచ్చి అక్కడ పరిస్థితులు బాగా లేవని చెప్పాడని కేటీఆర్ అన్నారు. మరి ఇంత ఎండల్లో కొట్టిన చిన్న వర్షానికే మునిగిన హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో రోడ్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి అంటూ సోషల్ మీడియాలో కేటీఆర్ ను ట్యాగ్ చేసి వైసీపీ శ్రేణులు, ఆంధ్రా నేతలు, మేధావులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో కేటీఆర్ కు ఏం తోచడం లేదు.
Also Read: YS Sharmila Padayatra:1000 కిలోమీటర్లకు చేరిన వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం
అందుకే చెరపకురా చెడేవు అన్నారు. ఎప్పుడైనా ఒకరిని నిందించే బదులు మనది చక్కగా ఉందో లేదో చూసుకుంటే మంచిదనే వాదనలు కూడా వస్తున్నాయి. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే కానీ ఒక్కోసారి పరిస్థితులు వేరేలా ఉంటాయి. సామాజిక మాధ్యమాల కాలం కావడంతో ప్రతీది క్షణాల్లో ప్రజల చెంతకు చేరుతోంది. వైరల్ అవుతోంది. దీంతో వారు అన్ని పరిశీలిస్తున్నారు. ఎవరేంటి? ఎవరెన్ని నాటకాలు ఆడినా ఇట్లే అర్థమవుతోంది.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లుగా అయింది. దీంతో వారు వైసీపీని ఆడుకుంటున్నారు. ఇప్పటికి కూడా కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ పోస్టులు పెట్టడం తెలిసిందే. దీంతో వివాదం పెద్దదిగా మారిపోయింది. కేటీఆర్ చేసిన పనికి వైసీపీ ఫలితం అనుభవిస్తోంది. మళ్లీ వివరణ ఇచ్చినా గొడవ మాత్రం సర్దుమణగడం లేదు. ఇంకా ఎక్కువగానే ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అనుచరులు హైదరాబాద్ వరదలు, రోడ్ల దుస్థితిపై పోస్టులు పెడుతూ కేటీఆర్ పై సెటైర్లు వేస్తున్నారు. కౌంటర్లతో హోరెత్తిస్తున్నారు.
హైదరాబాద్ అభివృద్ధి పేరిట వేల కోట్లు కుమ్మరిస్తున్నా ఏం చేస్తున్నారనే సందేహాలు వస్తున్నాయి. ఒక్క వర్షం పడితే చాలు రోడ్లు జలమయంగా మారడంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఇన్ని సమస్యలు పెట్టుకుని కేటీఆర్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్ చేసిన పనికి ఏపీలో తలెత్తుకోకుండా చేశారని వాపోతున్నారు. ఒక్క మాటతో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలు వివాదాల్లో ఇరుక్కుపోయాయి. అందుకే పక్కవారి గురించి అనేముందు ముందు మన దుకాణం సరిగా ఉందో చూసుకుంటే మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.
[…] Also Read: YCP vs KTR: కేటీఆర్ పై వైసీపీ ప్రతీకారం షురూ […]