Rahul Gandhi Visit Telangana: తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఈనెల 6,7 తేదీల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. మొదల వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొని తరువాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో భేటీ కోసం ప్రయత్నించింది. కానీ వీసీ మాత్రం ససేమిరా అంటున్నారు.దీంతో కాంగ్రెస్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా రాహుల్ గాంధీని ఉస్మానియాలోకి తీసుకెళ్లాలనే పంతంతో ఉంది. కానీ వారి ప్రయత్నాలు సఫలం కావడం లేదు.

దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. విశ్వవిద్యాలయంలోకి రాహుల్ కు అనుమతి లేదని తేల్చింది. అయితే వీసీ కి మరోసారి దరఖాస్తు చేసుకుంటే చేసుకోవచ్చని సూచించింది. వీసీ ఇప్పటికే సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి ఓయూ మరోసారి రాజకీయ వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: YCP vs KTR: కేటీఆర్ పై వైసీపీ ప్రతీకారం షురూ
తెలంగాణ ఉద్యమంలో ఓయూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అసలు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది వారితోనే. ఈ నేపథ్యంలో ఓయూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.దీంతో మరోమారు ఓయూ రాజకీయాలకు వేదిక కానుందని తెలుస్తోంది. ఈనెల 7న రాహుల్ ఉస్మానియాలో పర్యటించేందుకు షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. కానీ అనివార్య కారణాల వల్ల రాహుల్ పర్యటన సాగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏం చేస్తారనే దానిపైనే ఉత్కంఠ కొనసాగుతోంది.

అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీ పర్యటనతో పోయిన పరువును నిలబెట్టుకోవాలని చూస్తోంది ఇందులో భాగంగానే ఓయూను వాడుకోవాలని యత్నించినా వారి పాచికలు పారడం లేదు. యూనివర్సిటీ వీసీ నుంచి అనుమతి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో దీన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తోంది.
దీనిపై సీఎం కేసీఆర్ ను కలవాలని ఆయన అపాయింట్ మెంట్ కోసం ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీంతో రాహుల్ పర్యటన రాష్ట్రంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారనుందని తెలుస్తోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి రాహుల్ పర్యటన కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపుతుందో వివాదాల్లోకి నెడుతుందో తెలియడం లేదు. కాంగ్రెస్ నేతల తీరు ఏ గొడవలకు దారి తీస్తుందో కూడా అర్థం కావడం లేదు.
Also Read:YS Sharmila Padayatra:1000 కిలోమీటర్లకు చేరిన వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం
[…] […]