YCP: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి ఎదురు లేకుండా పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ధాటికి టీడీపీ తట్టుకోలేకపోయింది. ఫ్యాన్ గాలికి సైకిల్ కు ఫంక్ఛర్ పడింది. దీంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా అధికార పార్టీ ముందు నిలవలేకపోయింది. పట్టు సాధిస్తుందని భావించినా చివరి క్షణంలో తడబడిపోయింది. ఫలితంగా అధికార పార్టీ ముందు మోకరిల్లింది. మొదటి నుంచి టీడీపీని లేకుండా చేయాలనేది వైసీపీ ఆలోచన. ఇందులో భాగంగానే ఆ దిశగా అడుగులు వేసి టీడీపీని దెబ్బకొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అసలు ఏం జరిగింది. అధికార పార్టీ ఏం ఎత్తులు వేసింది. టీడీపీని పడగొట్టే క్రమంలో వైసీపీ వ్యూహాలు ఏమిటీ? అనే ఆలోచనలు ఇప్పుడు అందరిలో వస్తున్నాయి. వైసీపీ టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా దెబ్బ కొట్టిందని తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ర్టంలో పార్టీ ఉండకుండా చేయాలనే ప్రయత్నాల్లో ఇలా చేసిందని పలువురు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో టీడీపీ భవితవ్యం ఏమిటి? తక్షణం చేపట్టాల్సిన విధానాలు ఏంటనే దానిపై మళ్లగుల్లాలు పడుతోంది. ఓటమికి కారణాలపై అన్వేషణ ప్రారంభించింది.
టీడీపీ పరాభవానికి జనసేన కూడా వత్తాసు పలికిందా? విజయం సాధిస్తుందని భావించిన చోట టీడీపీ ఓట్లు క్రాస్ ఓటింగ్ తో జనసేనకు లాభం చేకూరిందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. త్రిముఖ పోరులో టీడీపీ మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక దుకాణం మూసుకోవాల్సిందేనే అనే సంశయాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీకి మొహం చూపించే అవకాశం కూడా లేకుండా పోవడం గమనార్హం.
దాదాపు అన్ని స్థానాలపై వైసీపీ ప్రభావం చూపింంది. టీడీపీ బిత్తరపోయింది. దీంతో అధికార పార్టీ దెబ్బకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ కుదేలైపోయింది. రాష్ర్టంలో వైసీపీకి ఎదురు లేకుండా చేసుకోవాలన్నదే ప్రధాన ఆశయంగా కనిపిస్తోంది. దీనికి టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే దెబ్బ కొడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటనేది వారికే అంతుబట్టడం లేదు. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప టీడీపీ కోలుకోదని చెబుతున్నారు.
Also Read: Revanth Reddy: వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్న రేవంత్ రెడ్డి ? కారణాలేంటి ?