TDP BJP alliance: ఏపీలో రాజకీయ రణం అప్పుడే మొదలైంది. రాజకీయ పార్టీల మధ్య పొత్తుల డిస్కషన్ షురూ అయింది. ఈ పొత్తుల అంశం అధికార వైసీపీయే తెర మీదకు తీసుకొచ్చిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. చాలా కాలం నుంచి ఈ విషయమై చర్చ నడుస్తున్నది. తాజాగా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. మొత్తంగా పొత్తుల ద్వారా ఎన్నికల బరిలో ప్రతిపక్ష పార్టీలు ఉండబోతున్నాయనే తెలుస్తోంది. ఈ విషయాలపై ఇంట్రెస్టింగ్ స్టోరి..

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైం ఉంది. అయితే, ప్రతిపక్ష టీడీపీ ఇప్పటి నుంచే కార్యక్షేత్రంలో ఉండి అధికార వైసీపీని ఓడించాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అసెంబ్లీలో సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా, టీడీపీ ఒంటరిగా ఎన్నికల బరిలో ఉంటుందనే కొందరు అభిప్రాయపడ్డారు. కానీ, చాలా కాలం నుంచి టీడీపీ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నదనే వార్తలొస్తున్నాయి. ఇందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టాక్ ఉండేది. కాగా, ఈ విషయమై అధికార వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అవేంటంటే..
Also Read: BJP: మిషన్-2023.. బీజేపీలోకి ఉద్యమ నేతలు.. చేరికలతో బీజీబీజీ..!
ఏపీలో ఇటీవల భారీ వర్షాలకు వరదలు వచ్చినందున కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం కూడా జరిగింది. కాగా, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రతిపక్షనేత చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయమై లోకసభలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజు కూడా రాష్ట్రప్రభుత్వం పూయలేకపోయిందని, అది పూర్తిగా ఏపీ సర్కారు నిర్లక్ష్యమేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి విమర్శించారు. కాగా, కేంద్రమంత్రి వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్లాన్ ప్రకారమే కేంద్ర మంత్రి కామెంట్స్ చేశారని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. చంద్రబాబు దూతలు కేంద్రమంత్రితో అటువంటి కామెంట్స్ చేయించారని వైసీపీ మంత్రులూ అన్నారు. అలా మొత్తంగా బీజేపీ, టీడీపీని వైసీపీయే కలిపే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. కేంద్రమంత్రి ప్రకటన అచ్చం చంద్రబాబు ప్రకటన మాదిరిగా ఉండటం ఇందుకు నిదర్శనమనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. కొద్ది రోజుల కిందట బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందో లేదో చూడాలి.. ఇప్పటికైతే ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది.
Also Read: Jagan vs Raghurama: అనవసరంగా పెట్టుకొని జగన్ అభాసుపాలయ్యారా?