స్టీల్ ప్లాంటు విషయంలో ఏపీ బీజేపీ మౌనరాగం..

ఏపీలో బీజేపీ మౌనరాగం పాటిస్తోంది. విశాఖ స్టీలుప్లాంటు సమస్య కమలం నాయకులను నోరు మెదపకుండా చేస్తోంది. ఒకవైపు ప్రధాన మంత్రి మోదీ .. ఇతర కేంద్ర మంత్రులు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరిస్తామంటూ.. ప్రకటనలు ఇస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ నాయకులు ప్లాంటు ప్రయివేటీకరణపై ఏం మాట్లాడలేని పరిస్థితిలో తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఏపీలో ఆలయాలపై దాడుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు విశాఖ స్టీలు ప్లాంటు ప్రయివేటైజేషన్ ను వైసీపీ, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు […]

Written By: Srinivas, Updated On : February 28, 2021 1:58 pm
Follow us on


ఏపీలో బీజేపీ మౌనరాగం పాటిస్తోంది. విశాఖ స్టీలుప్లాంటు సమస్య కమలం నాయకులను నోరు మెదపకుండా చేస్తోంది. ఒకవైపు ప్రధాన మంత్రి మోదీ .. ఇతర కేంద్ర మంత్రులు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరిస్తామంటూ.. ప్రకటనలు ఇస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ నాయకులు ప్లాంటు ప్రయివేటీకరణపై ఏం మాట్లాడలేని పరిస్థితిలో తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఏపీలో ఆలయాలపై దాడుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు విశాఖ స్టీలు ప్లాంటు ప్రయివేటైజేషన్ ను వైసీపీ, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు తెరపైకి తెచ్చాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.

Also Read: ఏపీలో అభ్యర్థి భర్తపై అధికారుల దౌర్జన్యం

వీరివ్యాఖ్యలతో రొటీన్ రాజకీయాలు అలవాటు చేసుకున్నారని అర్థం అవుతోంది. ఏపీలో బీజేపీకి అంతగా పట్టులేకపోవడం ఒక కారణగా చెప్పవచ్చు. మరోవైపు స్టీల్ ప్లాంటు విషయమై విశాఖలోనే కాకుండా.. ఏపీ అంతటా ఈ అంశంపై సెంటిమెంట్ ఏర్పడింది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న భావనకు గండం ఏర్పడుతుందని అంతా భావిస్తున్నారు. బీజేపీ నేతలకు కూడా మొదట తాము ప్రయివేటీకరణకు అనుకూలం కాదని.. ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దలను ఒప్పిస్తామని విమానం ఎక్కారు. సోము వీర్రాజు, దగ్గుపాటి పురందేశ్వరి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించగా.. అవకాశం దొరకలేదు.

Also Read: బీజేపీ నేత‌పై దాడిని స‌మ‌ర్థించిన ప‌త్రికాధిప‌తి.. కార‌ణాలు ఇవే!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకి విషయం చెబితే.. పార్టీ వ్యవహారాలకే తాను పరిమితం అని స్పష్టం చేశారు. దీంతో ఏపీ బీజేపీ లీడర్లు చేసేదేమీ లేక నిస్సహాయంగా తిరిగి వచ్చేశారు. తరువాత విజయవాడకు వచ్చి ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేయాలని భావించారు. స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ అంశం ఇప్పుడే కాదని.. అసలు ఆ ముచ్చట లేనేలేదని చిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అధికార వైసీపీ పార్టీ తమకు వ్యతిరేకంగా బీజేపీ ఎదుగుతోందనే ఈర్శ్యతోనే ఇదంతా చేస్తుందని అన్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

వైసీపీ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ విరుద్ధంగా మాట్లాడుతోంది. ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ ఆపాలని కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్దలు బాగానే క్లాస్ పీకారని సమాచారం. ఆ విషయాన్ని భయటకు చెప్పని వారు ఆలయాలపై దాడులంటూ.. మరో ఇతర వాదనలు చేస్తూ.. చర్చలకు దారి తీస్తున్నారు. విశాఖలో ఒకప్పుడు బీజేపీ బలమైన పార్టీ.. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంటు దెబ్బకు మొత్తానికి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది.