
పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటుంటారు. షోకాజ్‌లు ఇవ్వడమో.. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో చేస్తుంటారు. కానీ.. ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవడంలో జగన్ చాలా ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. అంతా అయిపోయాక ఇప్పుడు చర్యలు తీసుకొని ఏం లాభమని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారట.
Also Read: సైలెంట్‌గా సైడ్ అయిపోయిన నారాయణ.. ఏమైంది?
సీఎం జగన్ తాజాగా.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై చర్యలకు పూనుకొన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించేందుకే సిద్ధమైనట్లు తాడేపల్లి వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. అయితే.. రఘురామరాజును బహిష్కరించడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ.. ఆ చర్యలు ఇప్పటికే ఎప్పుడో తీసుకోవాల్సి ఉండేనని.. అంతా జరిగిపోయాక స్పందించడం ఏంటని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
‘ఆయనపై ఎప్పుడో చర్యలు తీసుకోమని మేం చెప్పాం. అప్పట్లోనే వేటు వేసి ఉంటే.. ఆయన పూర్తిగా మైనస్ అయ్యేవాడు. మానసికంగా డిఫెన్స్‌లో పడేవాడు. కానీ, మా వాళ్లు వినలేదు.దీంతో ఎంపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. రాజకీయాల్లో ఇలాంటి నాయకుడు అవసరం అని అనిపించేలా అందరి దృష్టినీ ఆకర్షించాడు. పైగా రాజధాని విషయంలో ఆయన తీసుకున్న లైన్ కూడా అందరికీ నచ్చింది. ఇప్పుడు ఆయనపై వేటు వేస్తే.. పనిగట్టుకుని సింపతిని ఆయనకు ఇచ్చినట్టే’ అని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కీలక నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం.
Also Read: పగబట్టినట్లే వానలు.. ఎందుకిలా?
ఇదే అభిప్రాయాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ‘రఘురామరాజుతో మనకు ప్రయోజనం లేదని తెలిసినప్పుడు వెంటనే వేటు వేసి ఉంటే.. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ, ఆయనపై అప్పట్లో నేరుగా వేటు వేయలేదు. దీంతో ఆయన వైసీపీ నాయకుడిగానే ప్రజలు భావించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అంతే రేంజ్‌లో పాపులర్ అయ్యాయి. ఇప్పుడు వేటు వేసినా.. ఆయనకేం నష్టం లేదు. ప్రభుత్వ లొసుగులు బయట పెడుతున్నందుకు తనను బహిష్కరించారంటూ మరో వాదన తీసుకొచ్చి.. మరింత రెచ్చిపోతాడు. బహిష్కరించడం కాకుండా ఇంకేదైనా మార్గం ఉందేమో ఆలోచించుకోవాలి’ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రఘురామరాజు ఎపిసోడ్‌లో జగన్ ఏదో ఒకటి చర్యలు చేపట్టాలని డిసైడ్ అయితే.. చివరి నిమిషంలో ఇలాంటి అభిప్రాయాలు వెల్లువెత్తుతుండడంతో మరి ఆయన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
Comments are closed.